మెగాస్టార్ చిరంజీవి - ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరూ భేటీ అవుతున్నారనే వార్త పెద్ద సంచలనమే రేకెత్తించింది. దీనిపై పలు వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై మంత్రి బొత్స కూడా క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని సీఎం జగన్ భోజనానికి ఆహ్వానించారు. ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. ఇది సినిమాలకు సంబంధించిన మీటింగ్ అని బొత్స చెప్పిన బ్రేకింగ్స్ మీడియాలో వచ్చాయి. అయితే వీరిద్దరి కలయికకు సంబంధించి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడ్డాయి.

 


చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే అభిమాన సంఘం పేరుతో సోషల్ మీడియాలో చిరంజీవి – జగన్ భేటీపై పలు కామెంట్లు వెలువడ్డాయి. ఇవి వైరల్ కావడంతో చెవిరెడ్డే ఈ కామెంట్లు చేయిస్తున్నారా అని నెటిజన్ల నుంచి పలు రిప్లైలు వచ్చాయి. ఇవి తీవ్రం కావడంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పందించారు. ‘ఇదంతా టీడీపీ కుట్ర రాజకీయాల్లో భాగం. చిరంజీవిపై తన పేరుతో వస్తున్న పోస్టింగులను ఖండిస్తున్నాను. నాకు ఏ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఖాతాలు లేవు. నాకు చిరంజీవికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. తాను తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి చిరంజీవితో స్నేహం ఉంది. నా పేరుతో వస్తున్న పోస్టింగులపై పోలీసులకు కంప్లైంట్ చేసాను’ అని మీడియాకు తెలిపారు. దీంతో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.

 


ఈనెల 14న జరుగనున్న వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయాల పరంగా జగన్ – పవన్ తలపడుతున్నారు. చిరంజీవికి పవన్ సోదరుడు కావడంతో ఈ భేటీపై రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. చిరంజీవి మాత్రం ఏ రాజకీయ పార్టీలోనూ లేకుండా కేవలం సినిమాలే చేస్తున్నారు. మరి వీరి భేటీ సారంశమేమిటో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: