గత కొన్ని రోజులుగా  హైదరాబాద్ ను వదలకుండా వర్షాలు కురుస్తున్నాయి.  ఈ  వర్షాల కారణంగా సిటీలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ వర్షాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.  రోగాలతో సతమతమౌతున్నారు.  అంతేకాదు, కలుషితమైన నీరు తాగడం వలన సీజనల్ వ్యాధులు వస్తున్నాయి.  ఈ వ్యాధుల కారణంగా ఉన్న డబ్బులు వదిలించుకోవాల్సి వస్తున్నది.  


గత పది పదిహేను రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.  ఇదిలా ఉంటె, ఈరోజు సాయంత్రం హైటెక్ సిటీలో భారీగా వర్షం కురిసింది.  ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  ఈ ఉదయం నుంచి మబ్బులు పట్టినా.. వర్షం కురవలేదు.  అయితే, సాయంత్రం అయ్యే సరికి ఉన్నట్టుండి సడెన్ గా కుంభవృష్టి కురిసింది.  ఈ వర్షం ధాటికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.  రోడ్లపై నీరు నిలిచిపోయింది.  


రోడ్డుపై వాహనాలు కదలలేని స్థితిలో పడిపోయాయి.  విచిత్రం ఏమిటంటే.. రోడ్డుపై వెళ్తున్న కార్లు సగానికి మునిగిపోయాయి.  ఇక ద్విచక్రవాహనాలైతే.. ఏకంగా నీటిలో మునిగిపోయాయి. ఆటోల్లో ప్రయాణం చేసే వ్యక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.  ఒకవైపు వర్షం కురుస్తుండటంతో.. ఆటో లో కూర్చోలేక.. రోడ్డుపై దిగలేక ఇబ్బందులు పడ్డారు.  ఒకవైపు బస్సుల స్ట్రైక్ తో తంటాలు పడుతూ.. ఏదోలా సమయానికి గమ్యస్థానాలు చేరుకోవాలని చూస్తున్న ప్రజలపై వర్షం మరింత ఇబ్బంది పెడుతున్నది.  


గత కొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నది.  ఆర్టీసీ సమ్మె చేస్తున్న సమయం దగ్గరి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది.  మరో కొన్ని రోజులు ఇలానే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొన్నది.  వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  పర్యావరణం సమతుల్యత లోపించడం కారణంగానే ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది.  మరో  రెండు మూడు రోజులు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: