ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె పై తెలంగాణ మంత్రులు ఎదురుదాడి తీవ్రతరం చేశారు . ఒక వైపు విపక్షాలపై మండిపడుతూనే , మరొకవైపు ఆర్టీసీ కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారు . ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలంటున్న విపక్షాలు , తాము అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీలను ప్రభుత్వం లో  విలీనం చేశారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు . అదే సమయం లో ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదని పేర్కొంటున్నారు . కావాలంటే తమ ఎన్నికల మేనిఫెస్టో ను ఒక్కసారి చూసుకోవాలని మంత్రులు చెబుతున్నారు . 


బీజేపీ నేతృత్వం లోని కేంద్రం  రైల్వేను ప్రయివేటీకరిస్తుంటే , రాష్ట్రం లో ఆర్టీసీ గురించి ఆ పార్టీ   నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని  ఎద్దేవా చేస్తున్నారు .   ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు అర్ధరహితమైనవని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ లు వేర్వేరుగా మీడియా తో మాట్లాడుతూ కొట్టిపారేస్తున్నారు . ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కంటే, నాలుగు కోట్ల ప్రజలు అవసరం తీర్చడమే తమకు ముఖ్యమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు . 


కొందరు యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్లే ఆర్టీసీ కార్మికుల సమ్మె  జరుగుతోందని మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .   ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప , సమ్మెకు వెళ్లడం కరెక్టు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు . మంత్రి కాన్వాయి ని మహబూబ్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు అడ్డుకుని నిరసన తెలిపారు . ఆ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . దాంతో ఆర్టీసీ కార్మికుల వైఖరి పై అయన మండిపడ్డారు .


మరింత సమాచారం తెలుసుకోండి: