శ్రీరాముడు లంక పై యుద్ధానికి సిద్ధమై లంకకు వెళ్ళటానికి ఆ అంటులేని కడలిపై రామ సేతువు నిర్మాణం జరుగుతున్న వేళ అది. సేతు నిర్మాణానికి రామదాసు హన్మంతుడు, మితృడు సుగ్రీవుడు, వాలి తనయుడు మహా వీరుడు అంగదుడు, మొదలైన వానర వీరులు వానర సైన్యం మాత్రమే కాదు జాంబవంతుడు లాంటి  శక్తివంతులు సముద్రంలో సేతు నిర్మాణానికి రాళ్లు వేస్తున్నారు. అవి అంభోదిపై తెలుతున్నాయి.


ఇదంతా చూస్తూ  పర్యవేక్షిస్తున్న శ్రీరామచంద్రుడు తాను కూడా ఆ సంభ్రమంలో పాలు పంచుకోవటానికి కొన్ని రాళ్లు సముద్రంలో విడుద్దామని అందులో ఒక రాయిని వదిలాడు. చిత్రాతి చిత్రంగా ఆ శ్రీరాముడు వదలిన రాయి మునిగి పోయింది. “సరే లే” అనుకొని మరొక రాయిని సముద్రజలాల్లో వదలి వేశాడు. చివరకు అది కూడా మునిగి పోయింది. 


ఇదేంటి! వానరులు వేసిన రాళ్ళు కడలి జలాలపై అద్భుతంగా తేలుతున్నాయి. కాని నేను వేస్తే మునిగి పోతున్నాయి ఇదేమి విచిత్రం? అనుకున్న శ్రీరాముడు, మరొక రాయి విడిచి చూద్దాం అని అలాగే చేశారు. అది కూడా మునిగి పోయిందట.  ఇదేంటని శ్రీరాముడు తన ప్రియ భక్తుడు హనుమను పిలిచి మరి కొందరిని అడిగాడు. దానికి వారు:  

Related image


“స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం. మీరు రాయలేదు కదా! అన్నారు.

“అదేంటి! నేను స్వయంగానే వేస్తున్నాను కదా! మరల నా నామం రాయవలసిన అవసరం ఏమిటి? నా నామం రాసి వేసిన రాయి తేలితే, స్వయంగా నేను వేస్తే ఆ రాయి మునిగి పోవటం ఏమిటి?  ఎందుకలా? జరిగింది? అన్నారు శ్రీరామచంద్ర స్వామి.

అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.

“స్వామి! మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. “రాముడిని వదిలేసినా! రాముడు వదిలేసినా! మునిగి పోక తప్పదు" అదే జరుగుతోంది స్వామి” అని ఆ శ్రీరామ నామ మహత్మ్యం – ఆ శ్రీరాముని గొప్పతనం నర్మగర్భంగా వివరించాడు హనుమ తన మనోభిరామునికి.

అందుకే.......రామ నామాన్ని జపించండి. ధర్మంగా జీవించండి, శ్రీరాముని కంటే కూడా  శ్రీరామ నామం బహుగొప్పదని విశ్వానికి తెలిపారు హనుమ. 


మరింత సమాచారం తెలుసుకోండి: