మోడీలో రాజకీయ నాయకుడితో పాటు గొప్ప మెజీషియన్ కూడా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆయన చేతిలో రింగ్ మాస్టర్ స్టిక్ ఉందేమోనని అనుమానం కూడా ఉంది. మోడీ రాకముందు భారత్ విషయం తీసుకున్నా, మోడీ ఇపుడు చేస్తున్న విన్యాసాలు చూసుకున్నా కూడా ఏదో ఇంద్రజాల మహేంద్రజాలం మోడీ చేస్తున్నాడనిపిస్తొంది. లేకపోతే పాక్ అనుకున్న‌దేంటి, జరుగుతున్నదేంటి. పాక్ ఆశలు ఇపుడు పూర్తిగా అణిగిపోయాయిగా.


అవును మరి పాకిస్థాన్ కి అన్ని విధాలుగా మద్దతు ఇస్తూ వచ్చిన చైనా ఇపుడు మోడీ ముందు కనీసంగా కూడా కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి. మహాబలిపురం వేదికగా మహా జెల్ల పాక్ కి తగిలించేశారు మోడీ. దాదాపు ఆరుగంటల పాటు మోడీ, చైనా ప్రధాని జిన్ పింగ్ భేటీ అయినా కూడా ఎక్కడా కాశ్మీర్ అన్న మాట వినిపించలేదే. దాయాది పాక్ చెవులు రిక్కించి కూడా వినాలనుకుంది. మోడీని నిలదీసి నిగ్గదీసి కాశ్మీర్ గురించి జిన్ పింగ్ గట్టిగా అడిగేస్తారని, కడిగేతారని కూడా ఆశపడింది.


కానీ మోడీ ఇచ్చిన విందు భలే పసందు అనుకుంటూ జిన్ పింగ్ వచ్చిన దారే పట్టేశారు తప్ప కాశ్మీర్ అన్న మాటేలేదు ఎక్కడా. ఈ పరాభవం దాయాది కలలోనైనా వూహించి ఉండదు. ప్రపంచంలో పెద్ద దేశంగా ఉన్న చైనా అయినా సాయపడుతుందనుకుంటే జిన్ పింగ్ కొంపముంచేశాడుగా. ఇక ఇపుడు మోడీ మాయగాడు అని అనుకోవడం కంటే పాక్ చేయగలిగింది ఏమీ లేదేమో.  అటువైపు చూస్తే అగ్ర రాజ్యంగా  ఉన్న అమెరికాను మోడీ బుట్టలో పెట్టేశారు, ట్రంప్ పెద్దన్నగా ఉంటానని, కాశ్మీర్ కధ తేల్చేస్తానని చెప్పినా కూడా భారత్ వైపు చూసేసరికి మాత్రం ఏం మాట్లాడలేకపోయారు.  దాంతో ట్రంప్ ని మోడీ మాయ చేశారని అనుకుంది పాక్. ఇపుడు జిన్ పింగ్ ది కూడా సేం సీన్. దాంతో పాక్ కి దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోదంట.



మరింత సమాచారం తెలుసుకోండి: