మీడియాకు మసాలా కావాలి. మా మీద ఏదో రాస్తూ ఉంటారు. మీ రాతలు మీవి మా నమ్మకాలు మావీ అని బాబు బీరాలు పలుకుతున్నారు. విశాఖలో మీడియా మీట్లో బాబు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు. టీడీపీలో ఏదో జరిగిపోతుందని రాతలు రాసి సంత్రుప్తి పడండని బాబు మీడియాకు చురకలు అంటించే ప్రయత్నం చేసారట. మొత్తం పార్టీ నా వెంట ఉంది. పార్టీలో ఎక్కడేం జరుగుతుందో నాకు పూర్తి సమాచారం ఉంది. మీ  రాతలు తప్పు. వట్టి మసాలా వార్తలు అంటూ కొట్టిపారేశారట..


ఇదంతా ఎందుకంటే బాబు విశాఖ రివ్యూ మీటింగునకు తొలిరోజు వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెండవరోజు కనిపించలేదు. దాంతో మీడియాకు సహజంగానే అనుమానం వచ్చింది. అసలే గంటా నాలుగు నెలలుగా పార్టీకి ముఖం చూపించలేదు. బాబు వస్తున్నారన్న హడావుడిలో టీడీపీ ఆఫీస్ గడప తొక్కారు. అటువంటి గంటా బాబు పక్కన లేకపోతే కంగారు కాదా మరి. అదే మీడియా ప్రశ్నగా వేస్తే బాబు తెగ ఫీల్ అయిపోయారు.


ఆయన మాతోనే ఉన్నారు. ఉంటారు మీకెందుకు కంగారు అంటూ ఎదురుప్రశ్న వేశారు బాబు. ఇంతకీ గంటా బాబుకు అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం వెనక అనేక కధనాలు వస్తున్నాయి. జస్ట్ బాబుకు ముఖం చూపించేసి మమ అనిపించిన మాజీ మంత్రి గారు తన పూర్వపు వ్యవహారాలను అలాగే కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి గంటాకు రెండు ప్రధాన పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయని టాక్ నడుస్తొంది. అవేమీ కొలిక్కిరాకముందే బాబు విశాఖ టూర్ వచ్చిపండింది. ఇంతలో చెడ్డ కావడం ఎందుకు అని ఆయన మొహమాటంగానే మీటింగునకు వచ్చారని అంటున్నారు.


మరో వైపు గంటా ఏమీ ఆవేశంగా మీటింగులో వైసీపీ మీద విరుచుకుపడకపోవడం విశేషం. దాన్ని కూడా మీడియా పాయింట్ ఔట్ చేస్తోంది. ఇంత బాహాటంగా విషయం ఉంటే బాబు మాత్రం మీడియా మసాలా అనుకుంటే లాభం ఏంటి అంటున్నారు సొంత పార్టీ తమ్ముళ్ళు కూడా. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాబు గారే చెప్పుకున్నట్లుగా అయారాం గయారం వ్యవహారాలు అన్నీ బాబుకు తెలుసు అని అంటున్నారు. కానీ ఆయన ఇపుడు ఏం చేయగలిగే స్థితిలో లేరని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: