సిరియాలో గత కొంతకాలంగా అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాదులకు, సిరియాకు మధ్య యుద్ధం జరిగింది.  ఐసిస్ తీవ్రవాదులను సిరియా సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొన్నది.  దీంతో ఐసిస్ తీవ్రవాదులు కుర్దులు ఎక్కువగా ఉండే ఏరియాను ఆక్రమించుకోవాలని చూశారు.  కానీ కుర్దులు ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఐసిస్ తీవ్రవాదులను మట్టుపెట్టారు.  


దాదాపు 15వేలమంది ఐసిస్ తీవ్రవాదులను జైల్లో పెట్టారు. మొన్నటి వరకు కోర్టులకు అండగా అమెరికా బలగాలు ఉన్నాయి.  ఎప్పుడైతే అమెరికా బలగాలు అక్కడి తప్పుకున్నాయో.. అప్పుడే టర్కీ.. కుర్దుల స్థావరాలపై దాడులు చేసింది.  ఈ దాడుల్లో చాలామంది మరణించారు. మరోవైపు క్షిపణుల దాడుల్లో జైళ్లు దెబ్బతిన్నాయి.  దీంతో ఐసిస్ తీవ్రవాదులు జైలు నుంచి తప్పించుకొని బయటకు వస్తున్నారు.  


ఐసిస్ తీవ్రవాదులు జైలు నుంచి బయటకు వస్తే.. దాని వలన జరిగే అనర్ధం ప్రపంచం ఊహించలేదు.  ఒక్క సిరియాలోని కాదు.. ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా ఈ ఐసిస్ ఉగ్రవాదులు వ్యాపిస్తారు.  ఫలితంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.  అయితే, టర్కీ ఐసిస్ తీవ్రవాదులను వీరులుగా చెప్తున్నది.  వీరిని జైల్లో బంధించడం న్యాయం కాదని అంటోంది.  ఇక యూరోపిన్ దేశాలు కుర్దులకు సహకరిస్తే.. తమ దగ్గర ఉన్న 35 మిలియన్ మంది సిరియా శరణార్థులను యూరప్ లోకి వదిలేస్తామని బెదిరిస్తోంది.  


ఒకవేళ ఐసిస్ తీవ్రవాదులు సిరియా జైలు నుంచి తప్పించుకొని బయటకు వస్తే.. తిరిగి 2014-15 కాలం నాటి పరిస్థితులు ఏర్పడతాయని అంతర్జాతీయ సమాజం భయపడుతున్నది.  ఐసిస్ తీవ్రవాదుల మారణకాండ దారుణంగా ఉంటుంది.  వాళ్ళు చేసే వికృత చేష్టలకు అంతే ఉండదు.  అంతర్జాతీయంగా వీరు సృష్టించే మారణ కాండను తట్టుకోవడం చాలా కష్టం.  గా కుర్దులు ఇప్పుడు రష్యా దేశాన్ని శరణు వెడుతున్నారు.  ఒకవేళ రష్యా రంగంలోకి దిగితే.. టర్కీ తప్పకుండా పక్కకు తప్పుకుంటుంది.  అయితే, రష్యా నుంచి టర్కీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది కాబట్టి ఈ విషయంలో టర్కీకి రష్యా అడ్డు చెప్తుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: