ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉన్నది. పాకిస్తాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.  బోర్డర్ లో ఇండియన్ ఆర్మీని రెచ్చగొట్టేలా పాల్పులు జరుపుతున్నది.  దీనికి ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తున్నారు.  అయితే, ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతూనే ఇండియా పీవోకే పై దృష్టి పెట్టింది.  మరో కొన్ని సంవత్సరాల్లో ఇండియా పీవోకేను తిరిగి సొంతం చేసుకోనుంది. అందులో సందేహం అవసరం లేదు.  


ఇకపోతే, ఇండియాలో అలజడులు సృష్టించేందుకు పాక్ ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది.  రీసెంట్ గా గుజరాత్ తీరంలో పాకిస్తాన్ కు చెందిన ఐదు పడవలు ఒడ్డున కనిపించాయి.  ఈ పడవలు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యింది.  గుజరాత్ లో హై అలర్ట్ ప్రకటించారు.  ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది.  


ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో చెక్ చేస్తున్నారు.  ఎక్కడ ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అటవీ భాగం నుంచే కాకుండా, సముద్రతీర ప్రాంతం నుంచి కూడా తీవ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది.  దీంతో సముద్రజలాల్లో గస్తీని ముమ్మరం చేశారు.  అంతేకాదు, అయినప్పటికీ గుజరాత్ తీరంలో ఐదు పాకిస్తాన్ బొట్లు కనిపించడంతో కలకలం మొదలైంది.  ఆ పడవలను అణువణువునా తనిఖీలు చేశారు.  అందులో ఎలాంటి విధ్వంసం వస్తువుల కనిపించలేదు.  


అయితే, ఆ బొట్లు ఎలా వచ్చాయి.  అందులో ఎవరు వచ్చారు.. అనే విషయంపై ఆర్మీ, పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి.  అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాయి.  పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.  ప్రతి ఒక్కరు సహకరిస్తే దేశాన్ని రక్షించుకోవడం ఈజీ అవుతుంది. ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: