వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఎలాంటి  హామీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వెళ్తున్నారు.  జగన్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా వదిలేయడం లేదు.  ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.  అలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుండంతో ప్రజల ముఖ్యమంత్రిగా అవతరించారు.  ప్రజలు ముఖ్యమంత్రి జగన్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.  చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడు.  


పింఛన్ ఇస్తానని చెప్పిన జగన్ పింఛన్ ఇచ్చారు.  విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు.  ఉద్యోగుల విషయంలో కూడా అదే విధంగా ఉన్నారు.  అలానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  పోలీసులకు వీక్లి ఆఫ్ ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.  ఉద్యోగుల పదవీవిరమణ వయసును కూడా పెంచారు.  గ్రామాల్లోనే పరిపాలన సాగాలని చెప్పి గ్రామవాలంటీర్ల వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించారు.  ఈ వ్యవస్థలు ప్రస్తుతం సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. 


ఇక ఇదిలా ఉంటె,ఇప్పుడు పాదయాత్ర సమయంలో జగన్ కొన్ని హామీలు ఇచ్చారు.  అందులో ఒకటి హోమ్ గార్డులకు జీతాల పెంపు.  హోమ్ గార్డులకు జీతాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.  నెలకు కేవలం రూ. 18000 ఇస్తున్నది.  అంటే రోజుకు రూ. 600/- అన్నమాట.  ఇది సరిపోవడం లేదని,తమ గోడును గత ప్రభుత్వం పట్టించుకోలేదని హోమ్ గార్డులు వాపోయారు.  కాగా వారి కోరికను జగన్ ఇటీవలే తీర్చారు.  


పాదయాత్ర సమయంలో చెప్పినట్టుగా వారి జీతాన్ని రూ. 18000/- నుంచి రూ.21,500/- పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.  అంటే రోజుకు రూ. 600/- నుంచి రూ.710/- చేసింది.  ఇది గొప్ప నిర్ణయంగా చెప్పాలి.  ఈ నిర్ణయంతో హోమ్ గార్డులు శభాష్ అని అంటున్నారు.  జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. హోమ్ గార్డులు ప్రత్యేకించి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: