సమాఖ్య వ్యవస్థ మనది. కొన్ని పనులు కేంద్రం చేయాలి. కొన్ని రాష్ట్రాలు చేయాలి. ఇద్దరూ కలసి ఉమ్మడిగా చేసే పనులు కూడా ఉంటాయి. అయితే సమాఖ్య స్పూర్తికి కాంగ్రెస్ హయాంలోనే తూట్లు పడిపోయాయి. తరువాత ఎన్నో నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సైతం అదే బాటలో నడుస్తోందంటున్నారు. రాజకీయ కారణాలకే పెద్ద పీట వేయడంతో తమ తర భేదాలు చూపిస్తున్నారు.


ఈ పరిణామాలను తీసుకుంటే కేంద్రం ప్రతిపక్ష పార్టీల నాయకులను పక్కన పెడుతోంది. తమతో కలసి మెలసి ఉండేవారికే పట్టం కడుతోంది. ఇక చూసుకుంటే ఏపీ సీఎం జగన్ వైసీపీ అధినేత. ఆయనకు ఎన్నికల ముందు కానీ తరువాత కానీ బీజేపీతో ఎలాంటి పొత్తులు లేవు. ఆయన కేంద్రానికి అంశాల వారిగా మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి మద్దతుని ఆశిస్తున్నారు. అయితే బంపర్ మెజారిటీతో ఏపీలో బలమైన నాయకుడిగా అవతరించిన జగన్ మీద మోడీ, అమిత్ షా కన్ను నాడే పడింది. ఏపీకి సాయం చేస్తాస్తమంటూనే మాటలకే పరిమితం అవుతున్నారు.


జగన్ ఏం చేయలన్నా కేంద్రం ఇచ్చే నిధులు అవసరం. మరి జగన్ని ఆదుకోకుండా దెబ్బతీస్తే రాజకీయంగా బలహీనం అవుతారన్న ఎత్తుగడలతో ముందుకు పోతున్నారు. మోడీ కంటే నాలుగాకులు ఎక్కువ చదివారు అమిత్ షా. అందువల్ల మోడీ దర్శనం అయినా అమిత్ షా దర్శనం అవడం కష్టం. ఈ కారణంగానే అమిత్ షా జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అమిత్ షా ను మొన్న శుక్రవారం జగన్ కలవాల్సివుంది. ఈ మేరకు సీఎంవో ఆఫీస్ నుంచి కేంద్ర హోం మంత్రి ఆఫీస్ కి రెక్వెస్ట్ వెళ్ళింది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. ఆయన బిజీ అంటూ తప్పించుకున్నారు.


ఇంకోవైపు డిల్లీలో అనేక కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. ఆయన హస్తినలోనే ఉంటూ కూడాఅపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అన్న చర్చ ఇపుడు వస్తోంది. జగన్ మీద గురి పెట్టినందువల్లనే అమిత్ షా ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీని ఎలిమినేట్ చేయడానికి షా వేసిన స్కెచ్ కారణంగానే జగన్ని కలుసుకునేందుకు  ఇష్టపడంలేదన్న టాక్ కూడా ఉంది.


జగన్ జనంలో సీఎం గా పాతుకుపోకముందే మేలుకోవాలన్న అతి రాజకీయ తెలివితో బీజేపీ ముందుకు అడుగులు వేస్తున్నందువల్లనే జగన్ అమిత్ షా భేటీ జరగలేదని అంటున్నారు. ఈ పరిణామాలకు ముందు మోడీని జగన్ కలసినా ఆయన నుంచి ఏపీకి సాయంపై పెద్దగా హామీ లభించలేదని అంటున్నారు. మొత్తానికి దూరం మాత్రం పెరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: