చంద్రబాబు రాజకీయ అంచనాలు సరిగ్గా వేయలేకపోవడం వల్ల మోడీని దారుణంగా తిట్టేశారు. ఓ దశలో వ్యక్తిగత విషయాల వరకూ  కూడా వెళ్ళ్లారు. మోడీని ఏపీకి రావద్దు అన్నారు. ఆయనకు నల్ల కుండలతో స్వాగతం పలికారు. హిందీ సరిగా రాని బావమరిదితో ఘోరంగా తిట్లు తిట్టించారు. ఇక మోడీని దింపేసేందుకు ఏకంగా కాంగ్రెస్ తో గత వైరం మరచి మరీ పొత్తులకు రెడీ అయ్యారు. ఇలా మోడీని బదనాం చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని బాబు వదులుకోలేదు.


మరి ఇపుడు మోడీ బంపర్ మెజారిటీతో గెలిచి దేశంలో రెండవమారు ప్రధాని అయ్యారు. ఏపీలో సీఎం సీటు నుంచి దిగిపోయి బాబు మాజీగా మారారు. ఫలితాల తరువాతనే బాబుకు తత్వం బోధపడింది. మోడీతో పెట్టుకోవడం వల్లనే ఈ గతి పట్టిందని కూడా అర్ధమైంది. కానీ మోడీకి బాబు మీద మమకారం ఎందుకు ఉంటుంది. లేటెస్ట్ గా విశాఖ టూర్లో సైతం బాబు బీజేపీతో గొడవలకు పోయి తప్పుచేశామని ఓపెన్ గానే చెప్పేసుకున్నారు, తప్పు ఒప్పేసుకున్నారు.


ఈ విధంగా ఆయన వైపు నుంచి సానుకూల సంకేతాలు పంపిస్తున్నారు. మరి మోడీ అమిత్ షా బాబు వైపు మొగ్గుతారా. వారికి బాబు మీద కోపం తగ్గిందా. తమను నానారకాలుగా మాటలు అన్న బాబును ఎందుకు చేరదీయాలి. ఇది కదా అసలు కధ. అందుకే మోడీ షాలకు బాబు మీద కోపం తగ్గడానికి ఏపీకి చెందిన ముగ్గురు ప్రముఖులు రంగంలోకి దిగారని ఏపీ  రాజకీయ సర్కిళ్ళలో టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపీలోని ఒక ప్రముఖ నాయకుడు. అదే విధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అలాగే ఒక సినీనటుడు..ఈ ముగ్గురూ మోడీ, షాలకు చెప్పాల్సింది చెబుతున్నారుట.


మోడీ, షాలను ప్రసన్నం చేసి బాబుని వారికి చేరువ చేసేందుకు గట్టి ప్రయత్నాలు తెర వెనక జోరుగా సాగుతున్నాయట మరి మోడీ, షాలకు బాబుతో ఇపుడు ఏం ప్రయోజనం ఉంది. ఏపీలో ఆయన బలంగా లేరు. పైగా ఎమ్మెల్యేలు కూడా లేరు. జనంలో పెద్దగా విశ్వసనీయత లేదు. అందువల్ల మళ్లీ బాబుని నెత్తికెక్కించుకుని ఆయన పొలిటికల్ ఇమేజ్ పెంచుతారా. లేక బీజేపీలోని మరో వర్గం అంటున్నట్లుగా సొంతంగా ఏపీలో ఎదిగి తమదైన రాజకీయంతో జగన్ని ఢీ కొంటారా చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: