హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పోరు రోజురోజుకీ రసవత్తరంగా సాగుతుంది. ఇక ఎన్నికల సమయం వస్తే చాలు  ప్రజల వద్ద వాలిపోయే నాయకులందరూ... ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే గడువు ఉండడంతో 24 గంటలు ప్రజల వద్దనే గడుపుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు నాయకులు. ఇక అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నారు. హర్యానాలో 90 శాసనసభా స్థానలకు  ఎలక్షన్లు జరగనుండగా... ఎన్నికల ఇన్చార్జి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ని  నియమించింది  కేంద్రం. కాగా ఈ నెల 21న ఎన్నికలు జరగనుండగా 24న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

 

 

 

 

 అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటరు మహాశయులకు ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హర్యానా ఎన్నికల్లో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే బిజెపి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్... జన్  ఆశీర్వాద్  యాత్ర చేపడుతూ ప్రజలను బీజేపీ వైపు తిప్పుకుంటున్నారు  . ఇదిలాఉండగా కాంగ్రెస్ కు  కంచుకోటగా లాంటి అద్దంపూర్ లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించి టిక్ టాక్ స్టార్ కి శాసనసభ స్థానాన్ని  కేటాయించింది. ఈసారి ఎలాగైనా ఆదంపూర్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ భావిస్తోంది. 

 

 

 

 

 ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించిన అభ్యర్థులే కాకుండా... 16 మంది రెబల్స్ కూడా బరిలో ఉన్నారు. దీంతో హర్యాన కాంగ్రెస్ చీఫ్ కుమారి షెల్టా  సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై పోటీకి దిగిన 16 మంది రెబల్స్ ను  బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు హర్యానా కాంగ్రెస్ చీప్ కుమారి షెల్టా . పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు కుమారి షెల్టా  ప్రకటించారు . రెబల్స్ చర్య పార్టీ రాజ్యాంగ నియమాలకు  పూర్తిగా విరుద్ధం అని పేర్కొన్న ఆమె.. 16 మంది రెబల్ అభ్యర్థులను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుమారి షెల్టా నిర్ణయం సంచలనంగా మారింది. అయితే  వేటు పడిన వారిలో ముఖ్యంగా రంజిత్ సింగ్, మాజీమంత్రి నిర్మల్ సింగ్,  మాజీ డిప్యూటీ ఆజాద్ అహ్మద్ , రామ్ శర్మ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతం హర్యానా కాంగ్రెస్ చీప్  కుమారి షెల్టా  తీసుకున్న సంచలన నిర్ణయం హర్యానా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: