ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు బృందం ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చింది. వైయస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు సమాచారం లభిస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సునీల్ గ్యాంగ్ కు సుఫారీ ఇచ్చి ఈ హత్యకు ప్లాన్ చేయించాడని తెలుస్తోంది. 
 
కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీసీటీవీలోని ఒక చిన్న క్లూ ద్వారా పెద్ద ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ తరువాత ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. వివేకాను హత్య చేసిన నిందితులు హీరోహోండా వాహనాలను వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఒక సీసీ టీవీ కెమెరా పరిశీలన ద్వారా సిట్ ఈ వివేకా హత్య కేసు మిస్టరీని కనిపెట్టింది. 
 
సిట్ అధికారులు పులివెందులలో హీరో హోండా బైక్ ఉపయోగించే వారి గురించి విచారణ చేయగా వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ గురించి సిట్ అధికారులకు సమాచారం లభించింది. ఈ గ్యాంగ్ వెనుక ఎవరున్నారు ? ఈ గ్యాంగ్ కు బెంగళూరు నుండి డబ్బు అందించిన కీలక వ్యక్తి ఎవరు? అనే వివరాల గురించి సిట్ విచారణ చేస్తున్నట్లు అసలు నిందితుని వివరాలు ఈరోజు లేదా రేపు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. 
 
వివేకా హత్యకేసులో ఈ మధ్యకాలంలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డి సహకరించాడని శ్రీనివాస్ రెడ్డికి ప్రొదూటూర్ సునీల్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు సిట్ అంచనా వేస్తోంది. వివేకా హత్య కేసులో మొదటి నుండి అనుమానితులుగా ఉన్న వారికి నార్కో టెస్ట్ లు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూర్ సుఫారీ గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ విషయాల గురించి అధికారికంగా చెప్పాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: