ఏపీలో రాజకీయాలు శరవేంగా మారిపోతున్నాయి. ఎన్నికల ముందు వరకూ ఉప్పూ  నిప్పులా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య తెరవెనక ఏదో జరుగుతోందని జోరుగా  వూహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ తో బీజేపీ  బాగా దూరం పాటిస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ  పరిస్థితులను సొమ్ము చేసుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. దాంతో బాబుని వీలైనంతవరకూ వంచేసి తమ పంతం నెగ్గించుకోవాలని  బీజేపీ చూస్తోంది.


ఏపీలో అన్ని విధాలుగా గతి చెడిపోయిన టీడీపీకి వైభవం కలగాలంటే ఏ రకమైన ఒప్పందానికైనా తాను రెడీ అంటున్నారుట చంద్రబాబు. దానికి అనుగుణంగా ఒప్పందాలు  కుదిరితే ఏపీలో మళ్ళీ టీడీపీ బీజేపీ దోస్తీ కుదురుతుందని అంటున్నారు. ఏపీకి సంబంధించి బీజేపీ టార్గెట్ 2029. అప్పటికి పూర్తిగా  సీట్లు సాధించి ముఖ్యమంత్రి పదవి పొందాలని ఆ పార్టీ ఎత్తుగడ వేస్తోంది.


దానికి ముందుగా అంటే 2024 ఎన్నికల్లో సగం అధికారం పంచుకోవడానికి రెడీ అవుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఉన్న 175 సీట్లను బీజేపీ, టీడీపీ చెరి సగం పంచుకోవాలి. అదే విధంగా 25 ఎంపీ సీట్లలో మెజారిటీ బీజేపీకి ఇవ్వాలి. ఈ రకమైన ఒప్పందానికి టీడీపీ సిధ్ధపడితే రెండు పార్టీల మధ్య సాధ్యమైంత తొందరగనే మళ్ళీ పొత్తులు కుదురుతాయి.


ఇకపై లోకల్ బాడీ ఎన్నికలైనా, మరే ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ, టీడీపీ సగం సగం పంచుకుని విజయం సాధించాలన్నమాట. ఇది కమలం క్యాంప్ నుంచి వినిపిస్తున్న మాట. ఆ విధంగా టీడీపీ కనుక ఏపీలో సగం సీట్లు బీజేపీకి త్యాగం చేస్తే రెండు పార్టీల మధ్య ఒప్పందం సులువుగా కుదురుతుందని ఒక రకమైన ప్రచారం సాగుతోంది.


మరి తెలుగుదేశం తమది పటిష్టమైన పార్టీ అని చెప్పుకుంటుంది. ఎపుడూ బీజేపీకి పది పన్నెండు సీట్లు మించి ఇవ్వలేదు. కానీ ఇపుదు 80కి పైగా సీట్లు ఇచ్చేయాలి. దానికి బాబు ఒప్పుకున్నా క్యాడర్ ఒప్పుకుంటుందా, అసలే టీడీపీలో గొడవలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల వైభవం వస్తే ఒకే కానీ బెడిసికొడితే మాత్రం కొంప కొల్లేరే.


మరింత సమాచారం తెలుసుకోండి: