చరిత్రలో అక్టోబర్ 13  పండుగలు మరియు జాతీయ దినాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రోజు అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.ఇటీవల అమెజాన్ అడవులు అగ్నికి ఆహుతి కావడంలో పెద్ద సంఖ్యలో అడవి జాతి, సంపద కాలిబూడిద ఐన సంగతి తెలిసిందే ఇప్పటికే నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతవంతమైంది. దాంతో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మరో పక్క లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.

 

కాగా 1679 లో  పెను తుపాను సంభవించింది. దాంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతి చెందారు. కాగా ఇదే రోజున  ప్రపంచ గుడ్డు దినోత్స వాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఈ రోజున జన్మించిన చరిత్రపుషులను తెలుసుకుంద్దాం..1860:హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920), 1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012), 1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996), 1956: తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరికొండ మధుసూధనాచారి జన్మించారు.




1993: హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు. కాగా ఇదే రోజున మరణించిన చరిత్ర ప్రసిద్ధిన్ చెందిన వారి గురుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..1911: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867), 1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929), : పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు హీరాలాల్ మోరియా 2006లో మృతి చెందారు. ఆయన జననం 1924లో జరింగింది 





మరింత సమాచారం తెలుసుకోండి: