ఇటీవల హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల ప్రకారం కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌  ముందంజలో ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తెలిపారు. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక ప్రచారం తీరుతెన్నులపై పార్టీ ఇన్‌చార్జిలు, సీనియర్‌ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇన్‌చార్జిలతో పాటు, ఇతర నేతల నుంచి ప్రచారం జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. 


ఇంకో  వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంటింటికీ పార్టీ ప్రచారం చేరాలని పార్టీ నేతలను వెల్లడించారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు.. ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు అనూహ్య మద్దతు ఉంది, పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కనీసం 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాయి అని కేటీఆర్‌ తెలియచేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల చిహ్నం కారును పోలివున్న ట్రక్కు గుర్తుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వల్ప కొన్ని ఓట్ల తేడాతో గెలుపు దగ్గిచుకోలేదు అని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కొన్ని వాహనాలకు సంబంధించిన ఇతర గుర్తులు ఉన్నాయి కనుకా.. పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డమ్మీ ఈవీఎంలు ఉపయోగించాలని పార్టీ నేతలకు తెలిపారు.


 
దసరా పండుగ తర్వాత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ పాల్గొంటారని పార్టీ వర్గాలు మొదట తెలిపారు.  నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఈ నెల 4న హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో  రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలో కేటీఆర్‌ రోడ్‌షోలలో పాల్గొంటారని ప్రచారం చేయగా . చివరి నిమిషంలో పర్యటన షెడ్యూల్‌ రద్దు అయంది అని తెలిపారు.

కాగా, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్‌ పాల్గొనే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపారు. ఈ నెల 19న ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా.. సీఎం కేసీఆర్‌ ఈ నెల 18న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం ఉంది.కానీ  సీఎం కేసీఆర్‌ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి షెడ్యూల్‌ ఖరారు కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: