రాజధానిని తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్క నియోజకవర్గం అభివృద్ధికి ఏకంగా 1500 కోట్ల రూపాయలను మంజూరు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అందరి కళ్లూ ఆ నియోజకవర్గం మీదే పడ్డాయి. అదే- మంగళగిరి. ఈ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునికీకరణ కోసం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

 

దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మొత్తాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ)కు బదలాయించింది.  ప్రత్యేక కార్పొరేషన్.. మంగళగిరి, దానికి ఆనుకునే ఉన్న తాడేపల్లి మండలాన్ని కూడా కలుపుకొని ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ సహా మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన విధి విధానాలను రూపొందించబోతున్నాయి. దీనికోసం సమగ్ర ప్రణాళికలను ఈ మూడు శాఖలు రూపొందించాల్సి ఉంటుంది.


ప్రస్తుతం పాతూరు, కుంచనపల్లి, వడ్డేశ్వరం మున్సిపాలిటీలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. మరోసారి అక్రమ నిర్మాణాల తొలగింపు ఇప్పటికే కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాల తొలగింపు చర్యలకు దిగిన ప్రభుత్వం.ఈ సారి బకింగ్ హామ్ కాలువపై కన్నేసింది. బకింగ్ హామ్ కాలువ పరిసరాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించేలా త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
 రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న నివాసాలన్నింటిని తొలగించడానికి కసరత్తు చేపట్టబోతోంది. ఈ ప్రాంతంలో 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు.

గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వరకూ ఈ వంద అడుగుల రోడ్డు నిర్మాణమౌతుంది.బకింగ్ హామ్ పై నాలుగు వంతెనలు.. రేవేంద్ర పాడు వరకూ 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి సమాంతరంగా తాడేపల్లిని అనుసంధానించడానికి బకింగ్ హామ్ కాలువపై నాలుగు వంతెనలను నిర్మించడానికి సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలను రెంటినీ కలిపి అభివృద్ధి చేసేందుకు 1,500 కోట్ల రూపాయిలు కేటాయిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: