రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె తొమ్మిదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు అంటుంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

           

దింతో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది మనస్థాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్ నిన్న సాయింత్రం డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ రెడ్డి శరీరంలో తొంబై శాతం మేర కాలిపోయింది. 

            

అయితే నేడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు శ్రీనివాస్ రెడ్డి. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. 

           

శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అయితే ఒక పక్క మనస్థాపానికి గురై ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కాస్త కూడా తగ్గకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అసలు కొంచం కూడా కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

                   

మరింత సమాచారం తెలుసుకోండి: