కామంలో కళ్ళు మూసుకుపోయిన ఒక యువకుడు ఆఖరికి మన దేశంలో పవిత్రంగా పూజించే గోమాతను కూడా వదలలేదు. మనిషి శ్రేయస్సు కోసం శ్రమించే ఒక మూగ జీవాన్ని  తన కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్న ఇతని నీచమైన బుద్ధిని ఏమనాలి? అది కూడా కేవలం ఒకటిన్నర సంవత్సరం వయసున్న లేగదూడ మీద పడ్డాడు అంటే అతను మనిషా లేక రాక్షసుడా?


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు ఒకటిన్నర సంవత్సరం వయసున్న దూడను లైంగికంగా హింసిస్తున్నాడని స్థానిక పోలీసులు అతనిని అరెస్టు చేశారు. నిజాంపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ అనే యువకుడు శుక్రవారం అతని చుట్టుపక్కల వారికి పట్టుబడ్డాడు. అధికారులు అతను ఈ నీచమైన పనిని దాదాపు ఒక సంవత్సరం నుంచి చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.


స్థానికులు చెబుతున్న దాని ప్రకారం శుక్రవారం రాత్రి స్థానికులు లక్ష్మణ్ లేగదూడను కట్టేసిన రైతు ఇంటి చుట్టూ అనుమానస్పదంగా తిరగడం గమనించారట. అప్పుడు కట్టేసి ఉన్న దూడను అతను సమీపిస్తుండగా వారు వెంటనే అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంతకు మునుపు కూడా వారు అతనిని ఇలానే గమనించగా ఈసారి మాత్రం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులు అతన్ని విచారించగా అతను కేవలం పేడను తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పగా తిరిగి ఎదురు ప్రశ్నలు రావడంతో మరికొన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పాడట.


అయితే స్థానికులు మాత్రం అతను చెప్పిన మాటలకు సంతృప్తి చెందకపోగా తమకు ఎప్పటినుంచో ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అనుమానం ఉందని అయితే గ్రామంలో గొడవలు అవుతాయని ఉద్దేశంతోనే ఇతని ఇన్నిరోజులు వదిలి పెట్టినట్లుగా వారు తెలిపారు. ఇకపోతే బాధిత దూడను టెస్టుల కోసం వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అసలు నిజం ఇంకా బయటపడాల్సి ఉంది. ముద్దాయి పై ఐపీసి సెక్షన్ 377 ప్రకారం కేసు నమోదు కాగా ఇంకా పోలీసులు కొన్ని న్యాయ సంబంధమైన సలహాల ద్వారా అతనిపై జంతు హింస నివారణ చట్టం 1960 కింద కూడా కేసులు పెట్టేందుకు చూస్తున్నారు. ఇంతకుముందే హైదరాబాదులో కుక్కల పైన కూడా ఇలాంటివి జరిగిన సంఘటనలు చాలానే ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: