ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆర్టీసీ డ్రైవర్ నిన్న సాయింత్రం దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే ఈరోజు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు.  

         

నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి నిన్న ఖమ్మంలోని తన నివాసం వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికు తరలించారు.

                   

అయితే శ్రీనివాస్ రెడ్డి చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. 

         

అయితే ఈ మృతి పట్ల పలువురు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ వైఖరి చాల దారుణంగా ఉందని, సమస్యను పరిష్కరించేది పోయి పెద్దది చేశారని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ దిగిరావాల్సిందే అని వారు అంటున్నారు. అయితే ఈరోజుతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె తొమ్మిదొవ రోజులు అవుతుంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.. బడి పిల్లలకు మరో వారం రోజులు దసరా సెలువులు పొడిగిస్తాం, తాత్కాలిక డ్రైవర్లను తెచ్చుకుంటం అంటున్నారు తప్ప ఆర్టీసీ కార్మికులకు ప్రత్యామ్నాయాలు చెయ్యడం లేదు. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

             

మరింత సమాచారం తెలుసుకోండి: