అక్టోబర్ 21 వ తేదీన హరియాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి.  అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు నిర్వహణ కోసం ఈసీ ఇప్పటికే  అన్ని ఏర్పాట్లు చేసింది.  కాగా, ఈరోజు హర్యానా బీజేపీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.  ఈ మ్యానిఫెస్టోలో ఎక్కువగా భాగం యువతను, మహిళలను టార్గెట్ చేశారు.  యువతకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. యువతకు 25 లక్షల ఉద్యోగాలు  కల్పించేందుకు హర్యానా రెడీ అయ్యింది.  


ఉద్యోగాలు కల్పన కోసం యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయ్యింది.  సంకల్ప్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను రూపొందించారు.  యువతతో పాటుగా మహిళలకు పెద్ద పీఠ వేశారు.  మహిళల సాధికారికత కోసం ప్రభుత్వం పధకాలురూపొందిస్తోంది .  మహిళలకు ఉపాధి కల్పించేందుకు, విద్యా, ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  


సంక్షేమ, ప్రజా కర్షక హామీలు కురిపించారు.  అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా ఈ హామీలు ఉపయోగపడతాయని అంటున్నారు హర్యానా బీజేపీ నేతలు.  బీజేపీ కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చేందుకు జాతీయ స్థాయి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.  బీజేపీ సీనియర్ నేత జెపి నడ్డా హర్యానాలో విస్తృతంగా పర్యటిస్తూ... ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కూడా మ్యానిఫెస్ట్ ప్రకటించింది.  మహిళలకు పెద్దపీఠ వేసింది.  


మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అని పేర్కొన్నది.  మహిళలకు ఫ్రీ ప్రయాణం అఫర్ ఇవ్వడం అంటే... ప్రభుత్వంపై భారీ భారం పడుతుంది.  ఇప్పటికే ఆర్టీసీ లాసుల్లో ఉన్నది.  ఈ లాస్ కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడింది.  ఇప్పుడు ఫ్రీ ప్రయాణం అంటే పడే భారం అంతాఇంతా కాదు.  ఈ లాస్ ను ప్రభుత్వం మరో రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: