దేశం అన్ని రకాలుగా దూసుకుపోతున్నది.  ఎన్నో రకాలుగా విజయం సాధిస్తోంది.  సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ముందున్నారు.  గతంలో మహిళలు చెంబు పుచ్చుకొని ఏటి గట్టుకో లేదంటే.. రైలు పట్టాల పక్కకో వెళ్తుంటారు.  అలా వెళ్లి పనికానిచ్చుకొని వస్తుంటారు.  ఇది మహిళలు ఆత్మగౌరవానికి మాయని మచ్చగా ఉండటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.  ఇలా బహిర్భూమికి వెళ్లి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. 


అందుకోసమే దేశంలో యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించారు.  మరుగుదొడ్లు నిర్మించుకునే వాళ్లకు ప్రభుత్వం సబ్సిడీలో అన్నింటిని సరఫరా చేస్తున్నది.  ఇక ఇప్పటి మహిళలు మరుగుదొడ్లు లేకుంటే.. కాపురానికి రావడం లేదు.  మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువుగా ఉన్నది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి.  చాలామంది వీటిని అందంగా ఉపయోగించుకుంటున్నారు. 


అయితే, కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా, వాటిని వాడటం లేదట.  దానికి కారణాలు ఉన్నాయి.  చాలా గ్రామాల్లో నీటి సమస్యతో అల్లాడుతున్నాయి.  ఈ నీటి సమస్యల కారణంగా గ్రామల్లో మరుగుదొడ్లు వాడటం లేదు.  దీంతో మరుగుదొడ్లు శిథిలావస్థకు మారిపోతున్నాయి. అద్భుతంగా ఉన్న మరుగుదొడ్లు కాస్త మకిలం పట్టి దారుణంగా మారిపోతున్నాయి.  ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో  మరుగుదొడ్లు కట్టుకున్న వాటిని వాడకపోవడంతో ప్రభుత్వం ఇలాంటి వారిపై కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.  


గ్రామాల్లో నీటి కొరత కారణంగా కేవలం ఎక్కువ నీరు దొరకడం లేదట.  దీంతో బకెట్ నీళ్లకు బదులుగా చెంబు నీళ్లు పొచ్చుకొని బయలుకు వెళ్తున్నారు.  ఉత్తరప్రదేశ్ లో ఇలా నిరూపయోగంగా పడిఉన్న మరుగుదొడ్లు ఎక్కువగా ఉన్నాయి.  ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించినా.. వాటిని వాడటంలో ఉపయోగంలోకి తీసుకురావడంలో విఫలం అయ్యింది.  మరుగుదొడ్లు వాడటం వలన కలిగే ప్రయోజనాలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: