ఇప్పటికే భారత వాయుసేనలో యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ  ప్రస్తుత ఆధునిక యుద్ధ విమానాల తో పోలిస్తే వాటి సామర్థ్యం తక్కువగా ఉంది. దీంతో భారత వాయుసేనను  మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. భారత వాయుసేన లోకి ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ సామర్థ్యం కలిగిన రఫెల్ యుద్ధ విమానాన్ని చేర్చింది . కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఫ్రాన్స్ వెళ్లి అధికారికంగా రఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు. రఫెల్ భారత వాయుసేన  లోకి రాకతో ఇతర దేశాల దాడులను దీటుగా ఎదుర్కొనేలా భారత వాయుసేన పటిష్టమైంది . అయితే ఈ రఫెల్ యుద్ధ విమానం దీటుగా ప్రత్యర్థులపై దాడులు చేయడంతో పాటు... ప్రత్యర్థుల నుంచి పొంచి  ఉన్న అపాయాలను గ్రహించి సమాచారాన్ని  అందజేస్తుంది. మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలను భారత వాయుసేనలో తెచ్చేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. 

 

 

 

 

 

ఈ నెల  21 నిర్వహించబడే హర్యానా ఎన్నికల ప్రచారంలో  అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. బీజేపీ ప్రచారంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఓటర్లను  ఆకర్షిస్తుంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రఫెల్ యుద్ధ విమానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం భారత వాయు సేనలో  రఫెల్ యుద్ధ విమానం ఉండుంటే... పాకిస్థాన్ వెళ్లి  ఉగ్రవాదుల పై  దాడులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన తెలిపారు.భారత గగనతలం  పరిధిలో ఉంటూనే  శత్రువులను మట్టుపెట్టే  వాళ్లమని  రాజ్ నాథ్  సింగ్ పేర్కొన్నారు. 

 

 

 

 

 

 బాల్ కోట్ ఉగ్రవాదులపై దాడి చేసినప్పుడు భారత వాయుసేనలో రఫెల్ యుద్ధ విమానం లేకపోవడం వల్లే... దాడి చేయడానికి బాల్ కోట్  వరకు వెళ్లాల్సి వచ్చిందని... ఒకవేళ అప్పటికే భారత వాయుసేనలో రఫెల్ యుద్ధ విమానం ఉండుంటే  భారత గగనతలం నుంచి బాల్ కోట్  లో ఉన్న ఉగ్రవాదులతో  పాటు భారత గడ్డపై ఉన్న ముష్కరులను కూడా తరిమికొట్టే వాళ్లమని  రాజ్ నాథ్ సింగ్  వాఖ్యానించారు . ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాయుసేనగా  పేరున్న  భారత వాయుసేనలో రఫెల్ రాకతో... మరింత ఆధిపత్యం సాధించిందని రాజ్ నాథ్ సింగ్  పేర్కొన్నారు. త్వరలో మరో 7 రఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: