సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ కార్మికులు మాకు ఒక్కమాట కూడా చెప్పలేదుని తెలంగాణ ఉద్యోగ సంఘాల(టీఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ అన్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని మాపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయ్యడానికి చూసిన వాళ్ళే ఇవ్వాళ ఆర్టీసీతో కలిసి సమ్మె చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమస్యలకు ఉద్యోగ సంఘాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 16 అంశాల తో కూడిన నివేదికతో సీఎం కేసీఆర్ ని కలిశామన్నారు. మా పై ఆరోపణలు చేసే నైతికత వాళ్లకు లేదన్నారు. టీఎన్జీవో లపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఆయన ఖండించారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా పోరాటం చేయాలని రవీంద్ర సూచించారు.



ఆర్టీసీ సమ్మె కొన్ని రాజకీయ శక్తుల చేతిలోకి వెళ్ళిందని ఆయా ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవన్నారు. ఆర్టీసీ జేఏసీ మాతో మాట్లాడితే మేము వాళ్లకు మద్దతు పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్మికులు ఎవ్వరూ అధైర్య పడొద్దు..ఆత్మహత్యకు పాల్పడొద్దని హితవు చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగాల సంఘాల పై దుష్ప్రచారం జరుగుతుందని  టీఎన్జీవో రాష్ట్ర  సెక్రెటరీ జనరల్ మమత అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మేము భేటీ అయ్యామని చెప్పారు.




ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ని కలిశామన్నారు. సీఎం ని కలిస్తే తప్పేంటీ.. అదేదో నేరమన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం పిలుస్తే ఉద్యోగ సంఘాల నేతలుగా వెళ్ళామన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో భాగమేనన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం తెలంగాణ సాధన లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉద్యమం అనంతరం ఆర్టీసీ నేతలు మాతో ఎప్పుడూ కలవలేదన్నారు. ఉద్యమ జెఎసిలో ఆర్టీసీ నేతలు, నాయకులు మెంబర్స్ గా లేరని చెప్పారు. కార్మికులు  తొందరపాటు చర్యలకు పోకుండా నాయకత్వం పై ఒత్తిడి తేవాలన్నారు. రాజకీయ నేతలు ఉద్యోగ సంఘాలపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు మాతో కలిస్తే  సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: