ఏపీలో ఒక్కో నేత విషయంలో రాజకీయం ఒక్కోలా మారుతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే జంపింగ్‌లు మామూలుగా జరగలేదు. టిడిపి నుంచి ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లిపోయారు. ఇక టీడీపీ కీలక నేతలు సైతం ఇప్పటికే వైసిపిలోకి జంప్ చేసేశారు. మరో నాలుగైదు నెలల్లో టిడిపి నుంచి మరి కొందరు నేతలు సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి లేదా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లోకి వెళ్లి పోయేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బిజెపిలోకి వెళ్లడం అంటే కాస్త ట్విస్టే అనుకోవాలి.


అయితే ఓ వైసిపి సీనియర్ నేత విషయంలో ఇప్పుడు ఇదే జరగనుందా ? అంటే అవుననే ఆన్సర్ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసిపిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కు జగన్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో దగ్గుబాటి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.... ఆయన భార్య కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బిజెపి నుంచి విశాఖ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైసీపీని తరచుగా టార్గెట్ చేస్తూ వస్తోంది.


ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి సైతం జగన్ పై  తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక భార్య భర్తలు చెరో పార్టీలో ఉండి డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్న సందేహాలు వైసీపీ నేతల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల‌కు ముందు వ‌ర‌కు పర్చూరులో వైసిపి నేతగా ఉన్న రావి రామనాథం బాబును దగ్గుబాటికి తెలియకుండానే తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చారు. జగన్ సైతం ఉంటే భార్యభర్తలిద్దరు వైసీపీలో ఉండండి ... పురందేశ్వరితో బిజెపి కి రాజీనామా చేయించండి అంటూ అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. వైసీపీ నుంచి బయటకు వెళ్లండి అని జగన్ నేరుగా చెప్పకపోయినా ఉంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉండండ‌ని స్పష్టంగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


రెండు రోజుల క్రితం దగ్గుబాటి జగన్ తో భేటీ అయినప్పుడు జగన్ సైతం పురందేశ్వరి జగన్‌తో పాటు వైసిపిపై విమర్శలు చేసిన అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురందేశ్వరి కూడా వైసీపీలో చేర్పించాలని జగన్ సూచించగా.. ఆమె ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నందున ఇండియాకు వచ్చిన వెంటనే దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురందేశ్వరి బిజెపిని వీడి వైసిపి.లో చేరడం సాధ్యమ‌య్యేలా లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వైసిపి కి రాజీనామా చేసి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి గతంలో కూడా బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: