అధికార పీఠం అధిరోహించిన దగ్గర నుంచి అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటూ సీఎం జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. ఊహించని నిర్ణయాలతో పాటు జగన్ తన మేనిఫెస్టో నవరత్నాలు అమలులో భాగంగా ప్రజలకు అద్భుతమైన పథకాలు కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైఎస్సార్ వాహనమిత్ర పేరిట రూ. 10 వేల ఆర్ధిక సాయం చేశారు. ఏడాది పాటు కష్టపడ్డ కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ల కష్టాన్ని తన పాదయాత్రలో గుర్తించిన జగన్...అధికారంలోకి రాగానే వారికి అండగా నిలబడాలని అనుకున్నారు.


అనుకున్నదే తడువు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్ కు రూ.10 వేలు సాయం చేశారు. అయితే ఒక్కరోజులోనే ఈ సాయం రాష్ట్రమంతా ఉన్న డ్రైవర్లకు అందిపోయింది. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించి....అండగా నిలిచిన జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రోజంతా ఆటో నడిపితేనే గానీ కుటుంబ పోషణకు కష్టమవుతున్న సమయంలో ప్రతి ఏడాది 10 వేలు సాయం చేయడం వల్ల తమకెంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.


ఈ వైఎస్సార్ వాహనమిత్ర వల్ల లబ్ది పొందిన ప్రతిఒక్కరూ సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాగే తమ మద్ధతు ఎప్పుడు జగన్ కే ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సాయం ఫోర్ వీలర్ ట్రక్ వ్యాన్లు వారికి ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తమకు కూడా సాయం చేయాలని ఫోర్ వీలర్ డ్రైవర్లు కోరుతున్నారు. సీఎం జగన్ ఇది కూడా దృష్టిలో పెట్టుకుని వారికి సాయం అందిస్తే ప్రతి ఒక్కరి మద్ధతు లభిస్తుంది. మొత్తానికి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వాహనమిత్ర పేరిట ప్రవేశ పెట్టిన ఈ పథకం సూపర్ హిట్ అయిందనే చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: