గ‌త మూడేళ్ల నుంచి బీజేపీలో ఎక్కువుగా రాం మాధ‌వ్ పేరు ఎక్కువుగా విన‌ప‌డేది. అటు ఈశాన్య రాష్ట్రాలు, ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు క‌ర్నాక‌ట ఇలా ఎక్క‌డ చూసినా రాంమాధ‌వ్‌కే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేవారు. మోడీ రెండోసారి ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక ఆయ‌న‌కు రాజ్య‌స‌భ‌తో పాటు కేంద్ర మంత్రి ప‌ద‌వి కూడా వ‌స్తుంద‌ని ఊహాగానాలు వ‌చ్చినా అవేం జ‌ర‌గ‌లేదు. ఇక ఇప్పుడు ఇందుకు సీన్ రివ‌ర్స్ అయ్యినట్టే బీజేపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం న‌డుస్తోంది.


బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ కు చెక్‌పెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? జాతీయ‌స్థాయిలో బీజేపీలో గ్రూపు రాజ‌కీయాలు ముదిరాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీలో రాంమాధ‌వ్‌కు చెక్ పెట్టేందుకు కీల‌క నేత‌లు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. మోదీ విదేశీ ప‌ర్య‌ట‌ల‌న టూర్‌లో రాంమాధ‌వ్ కీల‌కంగా ఉండేవారు. ఇప్పుడు ఆయ‌న క‌న‌ప‌డ‌డం లేదు. ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కూడా ఆయ‌న లేరు.


బీజేపీ విదేశీ మిష‌న్ టీమ్‌లో రాంమాధ‌వ్ ఓ మెంబ‌ర్‌.... ఇత‌ర దేశాల‌తో సంబంధాలు... ఈశాన్య రాష్ట్రాల స‌బ్జెక్ట్‌ల‌ను ఆయ‌నే డీల్ చేసేవాడు. కొంత‌కాలంగా ఈ వ్యవ‌హారాల్లో ఆయ‌న అస్స‌లు క‌న‌ప‌డ‌డం లేదు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన జ‌మ్మూక‌శ్మిర్ వ్య‌వ‌హారాల‌ను సైతం ప‌క్క‌న పెట్టారు. పార్టీలో రాంమాధ‌వ్ దూసుకుపోతుండ‌డంతో ఆయ‌న ఎదుగుద‌ల న‌చ్చ‌ని కొంద‌రు కీల‌క నేత‌లు ఆయ‌న‌కు ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాల్లో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యార‌నేందుకు పై ప‌రిణామాలే నిద‌ర్శ‌నం అంటున్నారు.


పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు భూపేంద్ర‌యాద‌వ్‌, అనిల్ జైన్‌ రాంమాధ‌వ్ ప్లేస్‌కు ఎర్త్ పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు జీవిఎల్ ప్లేస్‌లో రాంమాధ‌వ్ రాజ్య‌స‌భకు వెళ్లాల్సి ఉండేదట‌. కానీ మోదీకి చెప్పి…రాంమాధ‌వ్‌కు సీటు రాకుండా చేశార‌ని ఢిల్లీ స‌ర్కిళ్ల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా రాంమాధ‌వ్‌కు చెక్ పెట్టే కార్య‌క్ర‌మం మాత్రం ఉధృతంగా సాగుతోందని బీజేపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోన్న మాట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: