తెలంగాణ రాష్టంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఈ నెల 21 వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. మొత్తం జనాభా 3,21,142 ను కలిగిన ఈ నియోజకవర్గంలో  మొత్తం ఓటర్లు 2,36,842 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్ ల సంఖ్య 302 వరకు ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్దం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తలపడుతున్న వివిధ రాజకీయ పక్షాలు మాత్రం  తమ తమ ప్రచారాన్ని ఉత్కంఠ భరితంగా సాగిస్తున్నాయి. ఎత్తుకి పైఎత్తు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.  ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి, ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి పద్మావతి రెడ్డి బరిలో నిలవగా ఇద్దరి మధ్యే ప్రధాన పోటి కొనసాగనుంది.ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్‌ 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో అక్టోబర్ 17నే టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. సభలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు.


సెప్టెంబర్ 23న హుజుర్‌నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ కుమార్ విడుదల చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా, 19వ తేదిన ప్రచారం ముగియనుంది. 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ మేరకు హుజర్ నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల ఏర్పాట్లను చేసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఏడు మండలాలున్నాయి. నేరేడుచర్ల  మండలం లో మొత్తం ఓటర్లు 34,087 మంది కాగా  పోలింగ్ స్టేషన్ లు 43 ఏర్పాటు చేశారు. పాలకీడు మండలంలో ఓటర్లు 19,639 ఉండగా 25  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మఠం పల్లి మండలంలో  34,855  ఓటర్లకు  43 పోలింగ్ కేంద్రాలు, మేళ్ళచెరువు మండలంలో ఓటర్లు 31,270 ఉండగా పోలింగ్ కేంద్రాలు 41 ని ఏర్పాటు చేశారు.  చింతల పాలెం మండలంలో ఓటర్లు 25,228 మందికి పోలింగ్ కేంద్రాలు 36 ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మండలంలో ఓటర్లు..47,886 ,పోలింగ్ కేంద్రాలు..57 . గరిడే పల్లి మండలంలో ఓటర్లు...43,877 , పోలింగ్ కేంద్రాలు..57 లను ఏర్పాటు చేశారు. 



పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ అర్బన్ ఏరియాలో 31 , రూరల్ లో  271  చొప్పున మొత్తం..302 ఉన్నాయి.  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే..నార్మల్...223 ,  సమస్యాత్మక కేంద్రాలు 79 ఉన్నాయి.  ఈ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు పిఓలు 392 , ఎపిఓలు 392 , ఓపిఓ లు 392 , ఎస్ ఓఎస్ లు  27+1 , ఎస్ ఎస్ టీలు 9 , ఎఫ్ ఎస్ టీలు  7 ,  ఎంసిసి 7 ,విఎస్ టీలు 8 , వివిటిలు 1 , ఏటీ 2 , ఏఈఒలు 3 మంది,  రూట్ అధికారులు 27 మంది, రూట్లు. 27+1 లకు  మొత్తం 104  ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం పది కేసులు నమోదయ్యాయి. సి.విజిల్ ద్వారా వచ్చిన కేసులు..15 కాగా  మొత్తం నగదు సీజ్డ్..72,29,500 లు.  ఈ ఎన్నికల్లో మొత్తం ఈ విఎంలలో  బియూలు 967 ,  సియూలు363 , వివిపిటిస్ 378 ని ఉపయోగిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: