ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘోరపరాజయం మూటకట్టుకుంది. 175 అసెంబ్లీ సీట్లలో కేవలం 23 సీట్లలో మాత్రమే విజయం సాధించిన టిడిపి, 3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఘోర పరాజయంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో మిగిలి ఉన్న నేతలకు కేడర్ కు ధైర్యం కల్పించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అవుతున్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్యకర్తలు కూడా చేజారిపోతారని భావించిన బాబు అనుబంధ సంఘాలతో పాటు, పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.


ఇప్పటికే చంద్రబాబు సంస్థాగత ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ కమిటీలో ఎక్కువ మంది యువత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలు 33% యువతకు పదవులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పార్టీ పదవుల కోసం పోటీ ఎక్కువ ఉండేలా చూడాలని డిసైడ్ అయిన బాబు బ్యాలెట్ పద్ధతిలో పార్టీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా జరిగితే ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని చూసే నేతలు పోటీ పెరిగి పార్టీ పట్ల మరింత చిత్తశుద్ధితో పని చేస్తారు అన్నది బాబు ఆలోచన.


ఇక పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో అనుబంధ సంఘాలను పట్టించుకునే విషయంలో, పటిష్టం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ యాక్టివ్ గా ఉండటంతో ఆయనను మార్చే అవకాశం లేదు.  అసలు గత ఎన్నికల్లో అవినాష్ కు తెలుగు యువత కోటలోనే గుడివాడ అసెంబ్లీ సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నాదెళ్ల బ్రహ్మం చౌదరి విషయంలోనూ చంద్రబాబు పూర్తి పాజిటివ్ గానే ఉన్నారు.


తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. ఆమె యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె స్థానంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అర్జునుడు నియమించాలని భావిస్తున్నారు. వీటితో పాటు మిగిలిన అనుబంధ సంఘాల నాయకులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. వాటిని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయకపోతే కేడర్లో ఉత్సాహం ఉండదని, క్యాడర్ మానసిక స్థైర్యం కోల్పోతున్న ఆందోళనలో బాబు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: