వీకెండ్ లో సరదాగా గడిపేందుకు పార్కులో ఉల్లాసంగా గడపడం సర్వసాధారణం. అదే జూపార్క్ లకు వెళ్లితే సందడే సందడి. ఇటీవల కాలనీ ఈ మాత్రం సమయం దొరికిన సమల్లోని పార్కులు, జూపార్కుల్లో కడపడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే జూపార్క్ కు వెళ్లిన కొంత మంది యువకులు సరదాగా సందడి చేయాల్సింది పోయి బేజారైపోయారు. సింహాన్ని దగ్గరగా చేస్తే ఎవరికీ మాత్రం భయం కలగదు. అందులోను ఆ సింహం వెంబడిస్తే ఇక చూసుకో..మజా ఉంటది. అప్పటి వరకు జూపార్క్ అందాలను చూస్తూ మైమరిపోతున్నారు ఓ గ్రూప్.


అంతలోపే ఓ మృగరాజు వారి కంటపడింది. వారు దాన్ని ఏమైనా అన్నారో లేక తనను ఏమైనా చేస్తారని ఆ సింహం భయపడిందో తెలీదు గానీ.. వెంటనే వెంబడిస్తూ.. టూరిస్ట్‌లకు చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూపార్క్‌లోకి ఇటీవల కొంతమంది టూరిస్ట్‌లు యాత్రకు వెళ్లారు. ఓ సఫారీ వాహనంలో లోనికి వెళ్లిన వారు అక్కడి అందాలను చూస్తున్నారు.



అనుకోకుండా అదే సమయంలో కోపంతో ఉన్న ఓ మగ సింహం వారిని వెంబడించింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వేగంగా తమ వాహనాన్ని  నడిపాడు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆ సింహం జీప్‌కు చాలా దగ్గరగా కూడా వచ్చేసింది. దీంతో ఆ టూరిస్ట్‌ల భయంతో కూడిన కేకలు పెట్టారు. ఇక ఒకానొక సమయంలో సింహానికి దూరంగా వచ్చామని భావించిన వారు తమ వాహనాన్ని కాసేప ఆపగా.. మళ్లీ ఆ సింహం వెంబడించింది. ఇలా వారి ఫన్ యాత్ర కాస్త సాహస యాత్రగా మారగా.. ఆ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: