ఈ టైటిల్ చూసి మీరే కాదు ప్రతి ఒక్కరు షాక్ అవుతారని తెలుసు.  గాంధీ ఎలా మరణించారు అని ఎవరిని ప్రశ్నించినా అందరి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే.. గాంధీని నాధూరాం గాడ్సే అనే వ్యక్తి కాల్చి చంపడం వలన మరణించాడు.  స్వతంత్రం వచ్చిన తరువాత ఆయన్ను గాడ్సే కాల్చి చంపాడు అని చెప్తారు.  స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురికావడం దేశ దురదృష్టం.  ఈ సంగతి ఒకటో క్లాస్ చదివే పిల్లవాడిని అడిగినా చెప్తారు.  


గాంధీగారు ఎక్కడ పుట్టారు అంటే గుజరాత్ లోని పోరుబందర్ లో అని చెప్తారు.  అలాంటి గుజరాత్ లో గాంధీ గారి గురించి తప్పుగా తప్పుగా ప్రశ్న అడిగితె ఎలా ఉంటుంది చెప్పండి.  అలా అడిగింది బయట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోరు.  ఒక స్కూల్ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగారు.  గాంధీగారు ఎలా ఆత్మహత్య చేసుకున్నారు అని అడిగారు.  


ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.  సోషల్ మీడియా ఆ స్కూల్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నది.  గాంధీ మహాత్ముడు పుట్టిన రాష్ట్రంలో ఓ స్కూల్ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్న అడగడం దురదృష్టకరం అని అంటున్నారు.  సఫలం శాల వికాస్ సంకుల్ పేరిట ఓ స్కూల్ నడుస్తున్నది.  దీనిని ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నా.. ఆ స్కూల్ కు నిధులు ప్రభుత్వం నుంచి అందుతుంటాయట.  ప్రభుత్వం ఇచ్చే నిధులతో నడిపే స్కూల్ లో ఇలాంటి ప్రశ్నలు అడిగితె...ఇక ప్రైవేట్ స్కూల్స్ లో ఇంకెలా ప్రశ్నలు అడుగుతారు అని ప్రశ్నిస్తున్నారు.  


దీనిపై అక్కడి విద్యాశాఖ స్పందించింది.  ప్రశ్నపత్రంలో తప్పుగా ప్రశ్నను అడిగిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.  ప్రభుత్వం నుంచి నిధులు మాత్రమే అందిస్తున్నామని, ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కూల్ నడవడం లేదని, ప్రశ్నపత్రాన్ని తయారు చేసిన స్కూల్ యజమాన్యంపైనా, ఆ ప్రశ్నను తయారు చేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పింది విద్యాశాఖ.  ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో ఇలా తప్పులు జరిగితే ఎలా చెప్పండి.  ఎవరి గురించో తప్పుగా ఇస్తే పర్వాలేదు.  జాతిపిత గురించి అడిగే ప్రశ్నలో తప్పులు దొరిలితే.. ఇండియా పరువు ఏమైపోవాలి చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: