ఇండియా పాకిస్తాన్ ల మధ్య దోస్తీ చెడిపోయినా.. ఇండియా మాత్రం పాక్ కు ఇంకా స్నేహహస్తం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది.  పాకిస్తాన్ ను ఇప్పటికే ఏఎఫ్టిఎఫ్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.  దీంతో ఆ దేశానికి వచ్చే నిధులు తగ్గిపోయాయి.  అసలే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో పాక్ కొట్టుమిట్టాడుతోంది.  ఈ సమయంలో ఏఎఫ్టిఎఫ్ కూడా నిధులు ఇవ్వకుంటే పాక్ పరిస్థితి మరింత అద్వాన్నంగా మారిపోతుంది. పాక్ లో ఉగ్రవాద నిర్మూలన విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, ఉగ్రవాదులను ఆ దేశం ఇంకా పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ సమాజం తీర్మానించింది.  అందుకే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.

ఇది ఆ దేశానికీ ఇబ్బంది కలిగించే అంశమే.  అయితే, తాము ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని చెప్తూనే ఉన్నది.  చెప్తున్నది కానీ, ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు.  అటు అమెరికా సైతం పాక్ దేశానికీ ఇచ్చే సహాయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నది.  చైనా నుంచి వచ్చే సహాయం అంతంత మాత్రమే అన్నది అందరికి తెలుసు.  చైనా కేవలం పాక్ ను తన అవసరాలకు మాత్రమే వాడుకుంటోంది.  కాగా, ఇప్పుడు పాకిస్తాన్ దేశానికీ ఇండియా బంపర్ అఫర్ ఇచ్చింది.  


ఇది పాక్ కు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా పెద్ద దేశాలకు సైతం షాక్ ఇచ్చి అంశం అని చెప్పాలి.  పాక్ నిజంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంటే, దానికి కట్టుబడి ఉంటె, పాకిస్తాన్ దేశానికీ ఇండియా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.  ఇది నిజంగా షాక్ ఇచ్చే అంశమే.  ఇండియా బలమైన ఆర్ధిక దేశంగా ఎదుగుతుంది అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.  ఇప్పటికే ఇండియా అనేక దేశాలకు అప్పులు ఇచ్చింది.  రుణాలు ఇవ్వడమే కాకుండా అక్కడి రక్షణకు కావాల్సిన అవసరాలు కూడా తీరుస్తున్నది.  థర్డ్ గ్రేడ్ దేశాలకు ఆయుధాలను కూడా ఇండియా తక్కువ ధరకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.  


కాగా, ఇప్పుడు పాకిస్తాన్ దేశానికీ ఇండియా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం నిజంగా గొప్ప న్యూస్ గా చెప్పాలి.  అవసరం అనుకుంటే ఇండియన్ ఆర్మీని పాక్ కు పంపి అక్కడ ఉగ్రవాదుల ఏరివేతకు సహకరిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.  ఇది అభినందించదగిన విషయంగా చెప్పొచ్చు.  ఇక దీనిపై పాకిస్తాన్ ఆలోచించుకోవాలి.  నిజంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయాలి అనుకుంటే ఇండియా దానికి పూర్తిగా సహకరిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఇదే జరిగితే తిరిగి ఇండియా.. పాక్ దేశాల మధ్య మైత్రి బలపడినట్టే అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: