తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దేవుడిపై నమ్మకం ఎక్కువ.  ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఇలాంటి విషయాల్లో ముందు ఉంటాడు.  యాదాద్రి నిర్మాణంలో చొరవ చూపిస్తున్నారు.  రాష్ట్రంలోని దేవాలయాలను బాగుచేయడంలో అయన ముందు ఉంటున్నాడు.  ఇక గతంలో కెసిఆర్ చండీయాగం నిర్వహించారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమయానికి వర్షాలు కురవాలని ఈ యాగం చేశారు.  


ఈ యాగానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా స్టార్లు వచ్చి యాగాన్ని దర్శించి వెళ్తుంటారు.  సామాన్యలు కూడా యాగానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే.  ఆ యాగం చేసిన తరువాత కెసిఆర్ కు కలిసి వచ్చింది.  రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  ఇప్పుడు ఇదే బాటలు రాజకీయనాయకుడు కూడా నడవబోతున్నారు.  


అయన ఎవరో కాదు.. గతంలో వైకాపా  ఖమ్మం జిల్లా ఎంపీగా ఉన్న వ్యక్తి, వైకాపా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  ఖమ్మంలోని అయన మామిడి తోటలో ఈ యాగం చేస్తున్నారు. ఈ యాగం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.  గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన తరువాత అయన తెరాస పార్టీలో జాయిన్ అయ్యారు.  ఆ తరువాత 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరపున అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారని అనుకున్నారు కానీ, తెరాస పార్టీ ఆయన్ను దూరంగా పెట్టింది.  


అంతకు ముందు అయన ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేశారు.  ఈ కారణంగానే ఆయన్ను దూరం పెట్టారు.  ఇక 2019లో అయినా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇస్తారని అనుకున్నా అది కుదరలేదు.  తెలుగుదేశం పార్టీ నుంచి తెరాస లో జాయిన్ అయిన నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు.  రాజకీయంగా కలిసి రాబోతుండటంతో.. పొంగులేటి ఈ చండీయాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 16 వ తేదీ వరకు జరుగుతున్నది.  రెండు రాష్ట్రాల బోర్డర్ లో ఈ చండీయాగం జరుగుతున్నది కాబటి రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తులం యాగాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారని అనుకుంటున్నారు.  మహిళలకు కుంకుమ అర్చన చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. కెసిఆర్ ను కూడా ఈ యాగానికి ఆహ్వానించారు పొంగులేటి.  మరి కెసిఆర్ యాగానికి వెళ్తారా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: