ఎల్లవేళలా మద్దతుగా నిలిచే ఎల్లోమీడియా కూడా  చంద్రబాబునాయుడు భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆదివారం వచ్చే కొ(చె)త్తపలుకులో బిజెపి అగ్రనేతల మాటగా తన మనోభావాలను స్పష్టంగా చెప్పటమే విచిత్రంగా ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు పుంజుకోలేకపోవచ్చన్నది బిజెసి అగ్రనేతల భావనగా ఉందని ఈ ఎల్లోమీడియా చెప్పటమే విడ్డూరం. కలలో కూడా చంద్రబాబు డౌన్ ఫాల్ ను ఈ ఎల్లోమీడియా అధిపతి ఊహించలేరు. ఏపిలో తెలుగుదేశంపార్టీ బతకదని తేల్చేశారు.

 

ఎందుకంటే వీళ్ళద్దరి మధ్య ఉన్న అవినావభావం అలాంటిది.  చంద్రబాబు పంది అంటే పంది..నంది అంటే నంది ఈ ఎల్లోమీడియా యజమానికి.  చంద్రబాబు ప్రయోజనాలను రక్షించేందుకే నిరంతరం ఈ యజమాని తపనపడుతుంటారు. ఈ విషయంలో తన ఆలోచనలను ఏమాత్రం దాపరికం లేకుండా ప్రకటించేస్తుంటారు. పాఠకులు, జనాలు ఎవరేమనుకున్నా సరే తాను అనుకున్నదే అందరి నెత్తినా రుద్దాలని అనుక్షణం తపించేస్తుంటారు ఈ యజమాని.

 

తన కళ్ళతోనే చంద్రబాబుకు ప్రపంచాన్ని చూపిస్తుంటారు ఈ యజమాని. అందుకనే ప్రత్యేకహోదా, బిజెపితో చంద్రబాబు కలిసుండటం, రాజధాని నిర్మాణం, రైతు రుణమాఫి లాంటి అనేక విషయాల్లో ఈ యజమానిది, చంద్రబాబుది ఒకే మాట, ఒకే బాట. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసే బొక్కబోర్లా పడ్డారు. అప్పటి నుండి జాయింట్ గా జగన్మోహన్ రెడ్డిపై కక్షగట్టారు.

 

ఈ యజమాని మాట వినే ఏడాదిన్నర క్రితం బిజెపితో కటీఫ్ చెప్పుకుని చంద్రబాబు దెబ్బతిన్నారు. కాబట్టి  మళ్ళీ అదే బిజెపితో చంద్రబాబును దగ్గర చేయాలని చెత్తపలుకు యజమాని నానా అవస్తలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు సామర్ధ్యంపై ఎల్లోమీడియా యజమానికి ఓ క్లారిటి వచ్చేసినట్లుంది.

 

అయితే దాన్ని తన మాటగా చెప్పకుండా ఢిల్లీ బిజెపి అగ్రనేతల మాటలుగా చెప్పారు.  మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత పార్టీ పరిస్ధితి కూడా పూర్తిగా దిగజారిపోయింది. నేతలు వెళిపోతున్నారు. ఏరోజు ఏ నేత వెళిపోతారో చెప్పలేకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే ఎల్లోమీడియా యజమానికి కూడా చంద్రబాబు భవిష్యత్తు అయిపోయిందనే అనిపించుంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: