ఎవరైనా  తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా తయారు చేయాలి అనుకుంటారు. మంచి దుస్తులు వేసి అందంగా ముస్తాబు చేసి... ఎవరైనా చూస్తే అబ్బ ఎంత అందంగా ఉన్నారు అనుకునేంతలా  కుందనపు బొమ్మలాగా తయారు చేయాలి అనుకుంటారు. అలా ముద్దుగా తయారు చేసి వాళ్లని చూసి మురిసిపోతుంటారు. కానీ ఇక్కడ ఓ  తల్లి మాత్రం తన పిల్లలను దయ్యాల్లాగా మార్చేసింది. ఒంటినిండా రక్తం... చేతిలో మనిషి మెదడు... చూస్తే బెంబేలెత్తి పోయేలా తన పిల్లలను ముస్తాబు చేసింది ఈ తల్లి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆ పిల్లలు నిజంగా దయ్యాలా ... లేక ఊరికే అలా రెడీ అయ్యారా అని  కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఇంతకీ ఆ తల్లి ఎందుకలా తయారుచేసింది. తన పిల్లలను దయ్యాల ఎందుకు చూడాలనుకుంది  తెలియాలంటే స్టోరీ లోకి  వెళ్లాల్సిందే. 

 

 

 

 

 

 అక్టోబర్ నెల రాగానే పాశ్చాత్య దేశాల్లో హాలోవిన్ సంబరాలు మొదలు అవుతాయి. ఈ సంబరాలు వచ్చాయంటే చాలు అక్కడి ప్రజలందరూ దయ్యాలుగా  మారిపోతారు. నిజమైన దయ్యాలు కాదు కానీ  నిజంగానే దెయ్యాలేమో అనెంతలా దుస్తులు మేకప్ వేసుకొని ప్రత్యక్షమవుతారు. అక్కడి ప్రజలందరూ అక్టోబర్ నెల మొత్తం జాంబి వేషధారణలో నే కనిపిస్తుంటారు. అక్టోబర్ నెలలో ఎక్కడ చూసిన భయానక వేషధారణలతో  అక్కడి ప్రజలు ప్రత్యక్షం అవుతున్నారు. అయితే అందరిలాగే ఇక్కడ ఓ తల్లి కూడా ఆలోచించింది . అయితే ఈ తల్లి తన పిల్లల్ని దయ్యం లాగా తయారు చేసింది. 

 

 

 

 

 

 అమెరికాలోని ఓక్లహోమా కు చెందిన  బాబ్బి రెల్యాంట్  అనే మహిళ తన పిల్లలను జొంబి లుగా  తయారుచేసింది. ఎలా తయారు చేసింది అంటే చుసిన  భయంతో వనికి పోయేలా. ఒళ్లంతా రక్తం కారుతున్నట్టు మొత్తం ఎరుపు రంగు పూసి నిజంగా హారర్ సినిమా లో దెయ్యాలు ఎలా ఉంటాయో అలాగే రెడీ చేసింది ఈ మహిళ. తన పదేళ్ళ కూతురికి ఒక వైట్ డ్రెస్ వేసి ఒళ్లంతా రక్తం పూసి జొంబి లాగా  తయారుచేసింది. ఇక తన  పది నెలల బాబుకి ఓ టబ్ లో  రక్తపు నీటిలో కూర్చొని మనిషి మెదడు తింటున్న ట్లుగా తయారుచేసింది. కగా  వాళ్ల  ఫోటోలు  తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె . ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లను భిన్నంగా స్పందిస్తున్నారు. హలోవిన్  గురించి తెలిసిన వారు చాలా బాగా తయారు చేసిందని చెబుతుంటే... ఇంకొంతమంది వామ్మో ఎంత భయానకంగా తయారుచేసింది ఇలా తయారు చేయడానికి ఆ తల్లికి మనసెలా ఒప్పింది అని కామెంట్ పెడుతున్నారు. మరికొంతమంది పిల్లలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచితే మంచిది అని చెబుతున్నారు. అయితే ఈ కామెంట్లు అన్నిటిపై స్పందించిన ఆ మహిళ... వాళ్లను ఇలా తయారు చేయడానికి తక్కువ సమయమే పట్టింది కానీ ఆ మరకలు  క్లీన్ చేయటానికి చాలా  సమయం పట్టిందని తెలిపింది . అంతేకాకుండా తన కూతురికి జొంబి లు  అంటే భయపడేది అని కానీ తనని అలా తయారు చేసిన తర్వాత  తనను తాను చూసుకుని జొంబిలు   అంటే మనుషులు అని ... అలా విచిత్రంగా తయారు అయి ఉంటారని భయపడడం మానేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: