తెలంగాణలో కెసిఆర్ ఒకప్పుడు హీరో.  తెలంగాణ సాధన విషయంలో కెసిఆర్ చాలా కృషి చేశారు.  తెరాస పార్టీ తరపున ముందుండి పోరాటం చేశారు.  తెరాస పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో కెసిఆర్ ను హీరోను చేశారు.  అయన చేసింది శాసనంగా మారింది.  తెరాస పార్టీ రెండుసార్లు ఘనవిజయం సాధించింది.  అయితే, గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో కెసిఆర్ కు ప్రతికూలంగా పవనాలు వీస్తున్నాయి.  


కెసిఆర్ కు అనుకూలంగా మాట్లాడిన చాలామంది ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.  ఇది సహజమే.  అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, విరుద్ధంగా ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం మనిషి నైజం.  ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు ఇబ్బందులు కలిగించింది.  సమ్మెకు దిగిన ఉద్యోగులను తొలగించడంతో కార్మికు రోడ్డున పడ్డారు.  ఒకేసారి అంతమందిని తొలగించడం అసాధ్యం అని, చట్ట వ్యతిరేకం అని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమకు అన్యాయం జరిగిందని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.  


తమకు హరీష్ రావు దేవుడు అని, తెలంగాణా ఉద్యమ సమయంలో తమను ముందుండి నడిపించారని, పార్టీకి అతీతంగా అయన తమ వెన్నంటే ఉండి ఉద్యమ సమయంలో ప్రోత్సహించారని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.  హరీష్ రావు దేవుడు అంటూనే.. కష్టసమయంలో మాత్రమే దేవుడు సహాయం చేస్తారని కార్మికులు అంటున్నారు.  కొంతకాలం క్రితం వరకు యూనియన్ కు హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు.  కాగా, ఇప్పుడు అయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు.  


అయినా అయన దేవుడు అని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.  తెలంగాణ పోరాటంలో నిజమైన పోరాటం చేసిన వ్యక్తి హరీష్ రావు అని కార్మికులు చెప్తుండటం విశేషం. హరీష్ రావును దేవుడిని చేసి చూపిస్తూ.. కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం కొంత అనుమానాలకు దారితీస్తోంది. పైగా ఈ విషయంలో హరీష్ రావుకు పార్టీకి సంబంధం లేదని అని కూడా కార్మికులు అంటున్నారు.  పార్టీకి అతీతంగా హరీష్ రావును గౌరవిస్తారని చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: