వర్షాకాలం ఆరంభం అయింది అంటే వర్షాలు కురుస్తుంటాయి.  ఈ వర్షాల కారణంగా జనాలు జబ్బులు పడుతుంటారు.  జబ్బులు పడటం వలన అనేక ఇబ్బందులు పడుతుంటారు.  అంతేకాదు, ఈ వర్షాకాలంలో దోమలు ఇబ్బందులు పెడుతుంటాయి.  దోమకాటు వలన చాలామంది రోగాల బారిన పడుతుంటారు.  దోమలు కుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. 


అందులో ఒకటి మనిషి శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్.  ఇది ఎవరి నుంచైతే ఎక్కువగా విడుదలౌతుందో వారికి దోమలు ఎక్కువుగా కుడతాయి.  పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్లలో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.  అందుకే పెద్దవాళ్లకు దోమలు ఎక్కువుగా కుడుతుంటాయి.  అంతేకాదు బ్లడ్ గ్రూప్ ను బట్టి కూడా దోమలు కుడతాయట.  దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ నిజాలను బయటపెట్టారు.  


మనుషుల్లో ఏ, బి, ఏబి, ఓ, గ్రూప్ బ్లడ్ కలిగిన వ్యక్తులు ఉంటారు. ఇందులో ఓ గ్రూప్ మినహా మిగతా బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులకు దోమలు దూరంగా ఉంటాయి.  ఆ గ్రూప్ వ్యక్తులను దోమలు పెద్దగా కుట్టవు.  దోమకాటు వలన కలిగే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు విధిగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.  ముఖ్యంగా ఓ గ్రూప్ కలిగిన వ్యక్తులు.  వీరికే దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. 


ఇక జిమ్ చేసిన వచ్చిన వ్యక్తులకు కూడా దోమలు ఎక్కువగా కుడతాయని పరిశోధనలో తేలింది.  ఎందుకంటే జిమ్ చేసినపుడు శరీరం నుంచి చెమట కారుతుంది.  ఈ చెమటలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది.  దీనికి దోమలు ఎట్రాక్ట్ అవుతాయి.  అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  దేనికి భయపడని మనిషి దోమకు బయపడుతున్నాడు. ఇది నిజం.  ఎప్పటి నుంచో ఇలానే జరుగుతున్నది.  దోమకాటు వలన మరణించేవారు సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: