తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె మొదలై పదిరోజులకు చేరుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం దిశగా ఇప్పుడి  వరకు ఆలోచన చేయలేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అన్ని రాజకీయ పార్టీలు... ఉద్యమ సంఘాలు ఆర్టీసీ జేఏసీ కి మద్దతు తెలుపుతూ సమ్మెను ఉధృతం చేస్తున్నాయి . ఇక కేసీఆర్ తీరుతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 

 

 

 

 

 సమ్మె  ఎంత ఉదృతం అవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో  తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుళ్లో  ఆందోళన పెరుగుతుంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే... తెలంగాణలో తెలంగాణ పార్టీ పాలిస్తున్న సమయంలో తమకు న్యాయం జరగడం లేదని మనోవేదనకు గురవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా తమకు న్యాయం జరగడం లేదని బరువెక్కిన మనసుతో బలిదానాలకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి,  కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మబలిదానాలు తెలంగాణ ప్రజానీకాన్ని కంటతడి పెట్టించాయి. అంతే కాకుండా తాజాగా మరో డ్రైవర్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. 

 

 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంఘాలు ఆర్టీసీ కార్మికులు ఏకతాటిపై ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ... ప్రభుత్వం నిరంకుశ వైఖరి  అలభిస్తుండడంతో... ప్రాణ త్యాగాల తో అయిన తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుందేమో  అని ప్రాణాలు అర్పిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. అయితే రోజురోజుకు ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు  అర్థమవుతుంది. మొన్నటి వరకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతాలు కూడా ఇవ్వడం లేదు. చట్ట ప్రకారం చూస్తే కార్మికులు పని చేసిన అన్ని రోజులు జీతాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు మరింత ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: