తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సెగ పెరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసి కార్మికులు చేపడుతున్న సమ్మెకు తాము మద్దతిస్తున్నట్లు ఏపీ ఆర్టీసీ కార్మికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీ బస్సు డిపోల ముందు ప్రదర్శనలు చేపడుతున్నారు.


అంతే కాదు.. వారు కూడా కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. ఏపీలోని ఎంప్లాయిస్ యూనియన్.. తమ కార్యాచరణను ఈ నెల 19న ప్రకటించనున్నట్లు తెలిపింది. సమ్మెతొమ్మిదవ రోజుకు చేరుకున్నా సరే తెలంగాణా ప్రభుత్వం మొండివైఖరి తో తెలంగాణా జెఏసి నాయకత్వంతో చర్చలు జరపడం లేదని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఆరోపించారు.


స్వయంగా ముఖ్యమంత్రే ఆర్టీసీ కార్మికుల పట్ల కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఏపీ ఆర్టీసీ నాయకులు మండిపడ్డారు. కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటన చేయడం భావ్యం కాదని యూనియన్‌ నేతలు ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైఖరి భరించలేకనే ఒక ఉద్యోగి ఆత్మహత్యచేసుకున్నారని .. న్యాయమైన డిమాండ్లు పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపనందుకు నిరసనగా మొదటి దశ ఉద్యమం తలపెడతామని చెప్పారు.


ఈనెల 19న తెలంగాణా రాష్ట్రం బందుకు మద్దతుగా ఏపిలో ఆర్టీసీ ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విదులకు హాజరై తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు సంఘీబావం తెలియజేస్తామని తెలిపారు. అప్పటికీ తెలంగాణా ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించపోతే మాత్రం జెఏసి రాష్ట్రకమిటి గా చర్చించి ఈ నెల 19 స భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.


కార్మికులంతా ధైర్యంగా పోరాటాలు చేయాలని ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి ఏపీ ఆర్టీసీ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా తెలంగాణా సీఎం కేసీఆర్ మొండి వైఖరి మానుకొని ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంబించాలన్నారు. సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని ఏపీలోని ఆర్టీసీ నాయకులు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: