ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు  ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... ఆర్టీసీ కార్మికులు అడగకముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే... అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాత్రం లాభాలతో దూసుకుపోతుంది. దసరా పండుగ సీజన్లో ఏకంగా  20 కోట్ల లాభాలను ఆర్జించింది ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి. 2018 తో పోలిస్తే ఈసారి మంచి లాభాలు వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

 

 

 

 

 దీంతో దసరా పండుగ సీజన్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ లాభాల పంట పండినట్లే కనిపిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే 20 కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని తెలిపిన అధికారులు మొత్తంగా 229 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా స్పెషల్ సర్వీసులు,  రెగ్యులర్  బస్సులకి  మంచి డిమాండ్ ఉండటంతో... ఆక్యుపెన్సీ  రేషియో 103 శాతానికి పెరిగిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈనెల 13 వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ మొత్తంగా 5887 ప్రత్యేక సర్వీసులను నడిపిన్నట్లు గా అధికారులు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో దసరా పండుగ ఆరంభంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో... ఈ అంశం కూడా ఏపీఎస్ఆర్టీసీ కి కలిసొచ్చి లాభాలు తెచ్చిపెట్టింది. 

 

 

 

 

 అయితే దసరా సీజన్లో విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తారు కాబట్టి ... వారంతా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి సంస్థకు ఒక్కసారిగా లాభాలు పెరిగాయని తెలిపారు అధికారులు. అయితే నిత్యం 40 వేల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు... పండుగ సీజన్లో ఏకంగా 75 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చయట. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో నడుస్తూ ఉండటం తో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా తమను ప్రభుత్వంలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్లుగానే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: