లేబర్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరు అర్హలే. అయితే ఇందుకు  తెల్ల రేషన్ కార్డు మాత్రం తప్పని సరి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పధకాలను కేవలం తెల్ల కార్డు అర్హతగా పొందవచ్చు. అంటే ఇప్పుడు తెల్ల కార్డు ఉంటే అ కుటుంబానికే కొండంత అండ మరి. ఏడాదికి రూ 22 మాత్రమే చెల్లించాల్సింది. 5 సo రాలు ఒకేసారి చెల్లించాలి, కేవలం 110/-రూ.. మాత్రమే సుమా.  18 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి  స్త్రీ , పురుషులు అర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలి. బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో   ఇవ్వాలి. ప్రయోజనాలు ఏంటంటే.. పాలసీదారు సహజ మరణం పొందితే  రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ పొందవచ్చు.



అలాగే  ప్రమాద వశాత్తూ మరణం సంభవిస్తే రూ.6,00000/- లు అందజేస్తారు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా రూ. 30,000/-లు  ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ.30,000/-లు  చొప్పున వచ్చే అవకాశం ఉంది. ఒక సంసత్సరానికి పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది. ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే చాలు. 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి రూ. 22/-అన్నమాట వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.




ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్ ) ఎంపిడిఓ/ ఎమ్మారోలను సంప్రదించండి. చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది కార్మికులు మాత్రమే  చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే. చాలా మంది నిరుపేద కుటుంబాలు ఆర్ధిక స్తొమత లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి కుటుంబాలకు ఈ కార్మిక రెన్సూరెన్సు పధకం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయాల్లో అర్హులైనవారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం.   



మరింత సమాచారం తెలుసుకోండి: