ప్రస్తుతం తెలంగాణలో రెండు విషయాలు ప్రదానంగా చర్చకు ఉన్నాయి. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె కాగా... మరో ఒకటి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలు. మిగిలిన ఇతర  పార్టీలకు ఈ రెండూ వేర్వేరు అంశాలే అయినా... అధికార టీఆర్ఎస్ పార్టీకు మాత్రం ఈ రెండూ కూడా విడదీయలేని సమస్యలుగా మారిపోయాయని అందరికి అర్థం అవుతుంది. హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి టీఆర్ఎస్ పరిస్థితి చాల బాగుంది ఉంది.కానీ ఆర్టీసీ సమ్మె మొదలైపోవడం - దానిపై కేసీఆర్ తనదైన మార్కుతో  మోపడంతో ఇప్పుడు పరిస్థితి మొత్తం తల కిందులు అయంది అనే చెప్పాలి.


ఆర్టీసీ సమ్మె మొదలు కాకముందు ఎలాగైనా గెలిచేస్తామని ధీమా టీఆర్ఎస్ నేతల్లో బాగా ఉండేది... కానీ ఇప్పుడు గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్ట పడిన గెలుస్తామన్న గ్యారెంటీ లేదన్న భావన వచ్చేసింది అందరిలోనూ. అందుకే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో హుజూర్ నగర్ బైపోల్ క్యాంపెయిన్ బరిలోకి స్వయంగా కేసీఆరే రంగ ప్రవేశం చేయక తప్పడం లేదు.


ఇక ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా అక్టోబర్ 17నే టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించడం జరుగుంది అని తెలిపారు.  ఇక బహిరంగ  సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభలో కేసీఆర్ తనదైన మార్కు ప్రసంగంతో ఓటర్లను ఏ మేర ప్రభావితం చేస్తారో లేదో తెలియదు గానీ... ఒక్క నియోజకవర్గం - అది కూడా ఉప ఎన్నికలు  జరుగుతున్న నియోజకవర్గంలో గెలుపు కోసం స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగుతున్న వైనంపై ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి పార్టీ వర్గాలలో. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రులు - టీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఉప ఎన్నికల సంధర్భంలోనే తెలంగాణ  ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో కష్టకాలం ఎదురైంది అనేది చెప్పాలి. దీంతో ఆర్టీసీ కార్మీకుల సమ్మె  ఎఫెక్ట్ కూడా ఎన్నికలపై ప్రభావం చూపుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన సీపీఐ సైతం తమ మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధం అయినా విషం అందరికి తెలిసిందేనా కదా. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల  పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా - 19వ తేదిన ప్రచారం ముగుస్తుంది. 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ నుండి సైదిరెడ్డి - ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి పద్మావతి రెడ్డి బరిలో నిలవగా ఇద్దరి మధ్యే ప్రధాన గట్టి  పోటి నిలబడనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: