మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి నక్షత్రాలు కనిపిస్తున్నాయట. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తొమ్మిదేళ్ళు, విభజన తరువాత విభజిత ఏపికి ఐదేళ్ళు మొత్తం కలుపుకొని ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు అధికారం చెలాయించిన 40ఏళ్ళ రాజకీయ అనుభవశీలి ఆయన. చంద్రబాబు హయాంలో మొదటి తొమ్మిదేళ్ళు ఎలా వున్నా 2014 నుంచి 2019 వరకు పోలీసు వ్యవస్థను వినియోగించిన తీరు పదే పదే అపహాస్యం పాలయ్యింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఎవరైనా సరే వారికి ముందుగా గృహ నిర్బంధం, అయినా లొంగకపోతే జైళ్ళపాలు చేయటం, ఇక సోషల్ మీడియాలో పొస్టులు పెట్టె వారిని చెరసాల పాల్జేయటం అతి సహజంగా జరిగేవి. ఇక్కడ మహిళలు, పురుషులు అనే భేదం లేదు ఆఖరికి శాసనసభ్యురాలు రోజాను కూడా పలు కార్లు మార్చి రాష్ట్రమంతా తిప్పారు పోలీసులు. ఉమెన్ ఎంపవర్మెంట్ సమ్మిట్ కు హాజర్ కాకుండా ఆమెను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నారు. 


ఇక ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు వంటివి చేస్తామని ఏ రాజకీయ సంస్థగాని సామాజిక సంస్థ అయినా ప్రకటిస్తే చాలు, ముందుగనే ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే, పోలీసులు సమస్య, చర్చల్లోకి రాకుండా అనధికారికంగా చక్కబెట్టేస్తారు. నిరంకుశ చక్రవర్తుల పాలనను తలపించే విధంగా నారా చంద్రబాబునాయుడు తన అధికారాన్ని నిర్వహించారు దానిలో తన  అనుభవం అంతా రంగరించి ప్రయోగించారు. ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తూ సాగిన నారా వారి పాలనలో- జగన్ నాయకత్వంలోని వైసిపి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పాండవులు శపథం చేసి కౌరవులపై కక్ష తీర్చుకున్నట్లే - అధికారంలోకి వస్తే తమ తడాఖా చూపగలమని చెప్పిన వైసీపికి అధికార పగ్గాలు చేతికి వచ్చాయి.  


“నీవునేర్పిన విద్యయే నీరజాక్షా!” అన్నట్లు నారా బాబులకే దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా అదే బాబు వాడిన పోలీసు అస్త్రాన్ని వైసీపి బయటకు తీసింది. అంతేకాదు టిడిపి గతంలో చేసిన అప్రజాస్వామిక విధానాలే – పరిమాణం పెంచి, మరీ టిడిపికి దాని నాయకత్వానికి చికిత్స ప్రారంభించింది. పోలీసులకు మాత్రం ఈ విధానం సరదాగానే వుంది. అయితే గతంలో వైసీపి వారిని చీల్చి చెండాడిన ఏపి పోలీసులు – ఇప్పుడు టిడీపి వారిని చీల్చి చెండాడుతున్నారు. "చాకిరేవులో అన్నిబట్టలు ఒకటే. అలాగే అప్పుడు వైసిపి వారిని ఇప్పుడు టిడీపి వారిని చాకిరేవులో ఉతికేస్తున్నారు" ఏపి పోలీసులు. 


అందుకే తమకు అధికారం వస్తే అప్పటివరకు నిరాశా నిస్పృహల్లో వున్నవారు అంతా తమ దుగ్ధ వదిలించు కుంటున్నారు. దాంతో ఇప్పుడు టిడిపి అధినేత నారా చంద్ర బాబు నాయుడికి నక్షత్రాలు నిద్రలోనే కాదు, మెలుకువలోను కూడా కనిపించగా జావగారి పోతున్నారు. తాతకు పెట్టిన బొచ్చె తలాపున్నే ఉంటుందన్నట్లు – తాను తన అధికారం చాలాయించినప్పుడు వైసీపికి ఇచ్చిన ట్రీట్మెంటే – ఇప్పుడు వైసీపి అధికారంలోకి వచ్చాక టిడిపిపై ప్రయోగిస్తున్నారనిపిస్తుంది. 


నారా చంద్రబాబు నాయుడు పోలీసులపై సామ దాన భేధ దండోపాయాలు ప్రయోగిస్తూ తన మాటలతో (చేతలు కుదరవు కాబట్టి)  బెదిరిస్తున్నారు. పోలీసులు ఇలా వేధిస్తే ఎలా? అని మీరు రాజీనామాలు చేసి వైసిపి పార్టీలో చేరిపోండని చంద్రబాబు అంతటి నాలుగు దశాబ్ధాల అనుభవం ఉండీ బేలగా వాపోవడం ఇప్పుడు వైసిపిలోనే కాదు టిడిపి శ్రేణుల్లో కూడా హాస్యాస్పద చర్చనీయాంశం అయ్యింది. 


“పోలీస్ శైలి ట్రీట్మెంట్ & టార్చర్”  విపక్షాలకు అధికారం శాశ్వితం అనుకొని  నాడు రుచి చూపించి, అంతలోనే అధికారం తలక్రిందులు కావటంతో అదే రుచి తాము  చూడవలసి రావడం ఆయన్ని కలచివేస్తుంది. జగన్ అయితే యువకుడుగా భరించారు - ఇంత వయసు మీద పడ్డప్పుడు ఆ వేదన భరించడం చంద్రబాబుకు కష్టమే కదా! పాపం! బాబు భరించ లేకపోతే చిన్న బాబు ఉన్నాడుగా! 


మరింత సమాచారం తెలుసుకోండి: