వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారని అన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాల తరువాత కూడా మారటం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి గమ్యం లేదని, భవిష్యత్తు లేదని అందువలనే కనుచూపుమేరలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కనపడటం లేదని అన్నారు. 
 
ఈ కారణాల వలనే రాజ్యసభ ఎంపీలను తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలో చేర్చిందని చెప్పారు. బీజేపీ పార్టీలో చేరిన టీడీపీ ఎంపీలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అని ఎక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అక్కడ మటాష్ అని ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో ఆ రాజకీయ పార్టీ మటాష్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా కాదని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మటాష్ అయిందని అన్నారు. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు కూడా మటాష్ అయ్యాయని అన్నారు. చంద్రబాబు భవిష్యత్ అగమ్యగోచరమైందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు. లోకేశ్ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారని చెప్పారు. మీ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్ ఎన్నిసార్లు నిండింది? ఎన్నిసార్లు గేట్లు ఎత్తారు ? అని ప్రశ్నించారు. 
 
మీ ప్రభుత్వ హయాంలో సాగునీటి లెక్కలు చెప్పాలని సుధాకర్ బాబు చంద్రబాబును ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందని అది మీకు, మీ కుమారునికి కూడా తెలుసని చెప్పారు. ఎందుకు లోకేశ్ ఓడిపోయాడో, తెలుగుదేశం పార్టీకి కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు ఎందుకు వచ్చాయో ప్రజలకు చెప్పాలని అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: