హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల్లో హైటెన్షన్ ఏర్పడుతుంది. పోలింగ్ కు ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు సిద్ధమవతున్నాయి. ముక్యంగా ఈ  ఉప ఎన్నిక కాంగ్రెస్ - టీఆర్ఎస్ లకు అగ్ని పరీక్షగా మారింది అనే చెప్పాలి . హుజూర్ నగర్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఆ రెండు పార్టీలు సర్వ శక్తుల ప్రయత్నం చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతుంది.


ఇంకో పక్క  టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ లో ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో పరిణామాలు ఒక్కసారిగా తారు మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ సమ్మెకు మద్దతు పలుకుతుండగా - సీపీఐ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకుండా - ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి - సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేగాక ప్రభుత్వం మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో సమ్మె విరమింపజేస్తేనే - టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం తెలియచేసారు.


ఇంకో వైపు ఆర్టీసీ  సమ్మె విషయంలో మాత్రం ఆర్టీసీ యూనియన్ నేతలతో చర్చలు ఉండవని కుండబద్ధలు కొట్టడం కూడా జరిగింది. అంతేగాక ఇప్పటి వరకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని - ఇకపై కఠిన చర్యలు ఉంటాయని కూడా  అయినా  తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు. ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై వెనక్కితగ్గే  ఆలోచనలో లేనట్టే కనపిస్తుంది. 


ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజుల్లో తమ మద్దతును ఉపసంహరణపై నేతలు ఒక ప్రకటన చేసే అవకాశం కూడా వినిపిస్తుంది. నియోజకర్గంలో సుమారు 6 నుంచి 8 వేల వరకు ఓటు బ్యాంకు కలిగిన సీపీఐ ఒకవేళ గనుక నిజంగా టీఆర్ ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటే మాత్రం అధికార పార్టీకి నష్టం తప్పదని విశ్లేషకులు భావన తెలుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని - ఈ అంశాన్నికాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకుంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆ ప్రభావం కూడా పడే అవకాశం ఉందని  అందరు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: