తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు టీఆర్ఎస్ మంత్రులపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ ఫిర్యాదు చేశారు. సీఎం కేసీయార్ కార్మికుల ఆత్మహత్యకు బాధ్యత వహించాలని శోభ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు మంత్రులు మాట్లాడుతున్న మాటలతో మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. 
 
 24 గంటల లోపు కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటానని శోభ చెప్పారు. సీఎం కేసీయార్ తో పాటు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి శోభ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిన్న బొడిగ శోభ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపింది. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి పట్టించుకోవటం లేదని శోభ అన్నారు. విద్యార్థులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తారని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని శోభ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో ఉందని అన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నియమించిన ఆర్టీసీ డ్రైవర్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ మూసాపేట్ నుండి కూకట్ పల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురి కాగా మద్యం మత్తులో బస్సు నడిపాడని డ్రైవర్ రసూల్ ను  ప్రయాణికులు కొందరు చితగ్గొట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు కొన్ని జిల్లాల్లో బంద్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: