భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సరి కొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 30 మిలియన్ల ఫాలోయర్లు చేరారు. ప్రపంచ నేతల్లో ఏ నాయకుడికి కూడా ఈ స్థాయిలో ఫాలోయర్లు  లేరు అంటే నమ్మండి. 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మైలురాయిని అందుకోవడం జరిగింది. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీకి ఇన్‌స్టాలో కూడా ఫాలోయర్లు బాగా పెరిగారు. 


ఎంతలా  పెరిగారు అంటే.. ప్రపంచంలో ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ స్థాయిలో ఫాలోయర్లు ఉన్న నేత  మోదీ ఒక్కరే. ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (24.8 మిలియన్ల ఫాలోయర్లు), అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (14.9 మిలియన్ల ఫాలోయర్లు) కంటే కూడా మోదీ చాలా ముందున్నారు అని తెలుస్తుంది.


ప్రధాని మోదీకి ఇన్‌స్టా గ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. గత సెప్టెంబర్‌లో 50 మిలియన్ల ట్విట్టర్ ఫాలోయర్లను సంపాదించడం జరిగింది. ఫేస్ బుక్‌లో ప్రధాని మోదీ అధికారిక ఖాతాకు 44 మిలియన్ల లైక్స్ మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యాక్టివ్‌గా, ఫాలోయర్లు ఉన్న నేత ప్రధాని మోదీ. ఇన్‌స్టా గ్రామ్‌లో అత్యంత ఎక్కువ ఫాలోయర్లు ఉన్న వ్యక్తి పోర్చుగీస్ ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 186 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.


అయితే ఇప్పటి వరుకు ప్రపంచ నేతలలో ఏ నాయకుడికి కూడా ఇందులో ఇంత మొత్తంలో ఫాలోవర్లు లేరు. ప్రధాని మోదీకి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కూడా భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల మహాబలిపురంలో మోదీ చేసిన సేవకు కూడా చాల లైక్స్ రావడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: