ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయి దిక్కుతోచని పరిస్దితిలో పడిపోయారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ ఏ టిజేఆర్‌ సుధాకరబాబు ఎద్దేవా చేశారు. సోమరవరం తాడేపల్లిలో  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు  చంద్రబాబు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని టిడిపి నేతలే అంటున్నారని చెప్పారు. పైగా చంద్రబాబుకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందని చెబుతున్నారన్నారు. లోకేష్‌ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారని వాపోయారు. చంద్రబాబు నీ పని పూర్తిగా అయిపోయిందన్నారు. ఏ రోజు అయితే మంగళగిరిలో లోకేష్‌ ను గెలిపించుకోలేకపోయావో ఆరోజే నీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ విషయం నీ పార్టీలోని పెద్దలందరికి తెలుసని చెప్పారు.



తనకు తాను  మేధావివి, పండితుడివి, అనుభవజ్ఞుడిని చెప్పుకు తిరిగే బాబు ఎందుకు లోకేష్‌ ఓడిపోయాడో, ఎందుకు టిడిపిని తిరస్కరించారో, ఎందుకు నిన్నువద్దనుకున్నారో, 23 సీట్లే వచ్చాయో విశ్లేషించుకునేవాడవి. దాన్ని మానేసి  . పైగా బుకాయింపు మాటలు చెబుతున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపిలో టిడిపి పని అయిపోయిందన్నారు. తమ పని అయిపోతుందనే ఆ పార్టీకి చెందిన ఎంపీలను బిజేపిలోకి చేర్చారని విమర్శించారు. నీ పార్టీ సమావేశంలో నేను ఎందుకు ఓడిపోయానో అర్దం కావడం లేదని చెబుతావా?.కారణాలు మేం చెబుతాం...నీ ఇసుక దోపిడీ, నీ జన్మభూమి కమిటీలు కారణం. నీ అవినీతి,రాజధాని కడతానని పిచ్చిచెట్లు మొలిపించావు, పోలవరంలో వేలకోట్ల అవినీతి, రైతులకు రుణమాఫీ,డ్వాక్రామహిళలకు రుణమాఫి చేస్తానని మోసం చేసిన కారణమన్నారు. విద్యార్దులకు ఉద్యోగాలు ఇస్తానని, నిరుద్యోగభృతి ఇస్తానని మోసం చేసిన కారణమన్నారు. ఇవన్నీ ఒప్పుకోక దేశంలోనే తానే పెద్దనేతవని నాకు మించిన వారు లేరని అహంకారంతో ప్రవర్తించావు. అందుకనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 



ఇకనైనా బుధ్ది తెచ్చుకుని నీ ఐదేళ్లకాలంలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ఖజానాకు పంపాలని డిమాండ్ చేశారు. ఇసుక,మైనింగ్‌ లలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలముఠా సభ్యులు ఉన్నారు. ప్రతి చోట నీ వేగులున్నారు. నీవు రాష్ట్రాన్ని రాజకీయనేతగా కాక కార్పోరేట్‌ వ్యవస్దగా నడిపావని మండిపడ్డారు. ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబులో మార్పురాలేదన్నారు.  చంద్రబాబు రైతురుణమాఫి పేరుతో రైతులను మోసం చేశారు. 2016లో వైయస్‌ జగన్‌ గారు రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. రేపటి నుంచి ఆ పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు. రైతు కుటుంబాలలో  వైయస్‌ జగన్‌  ఆనందం నింపబోతున్నారు.రైతుభరోసా ఒక చారిత్రాత్మక పధకమన్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ లో రైతులు పూర్తిగా అన్యాయానికి గురయ్యారన్నారు. నవరత్నాలపధకం రాష్ట్ర్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇష్టవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆక్షేపించారు.


కారణాలు మేం చెబుతాం...నీ ఇసుక దోపిడీ, నీ జన్మభూమి కమిటీలు కారణం. నీ అవినీతి,రాజధాని కడతానని పిచ్చిచెట్లు మొలిపించావు, పోలవరంలో వేలకోట్ల అవినీతి, రైతులకు రుణమాఫీ,డ్వాక్రామహిళలకు రుణమాఫి చేస్తానని మోసం చేసిన కారణం,
విద్యార్దులకు ఉద్యోగాలు ఇస్తానని, నిరుద్యోగభృతి ఇస్తానని మోసం చేసిన కారణమన్నారు. ఇవన్నీ ఒప్పుకోక దేశంలోనే తానే పెద్దనేతవని నాకు మించిన వారు లేరని అహంకారంతో ప్రవర్తించావు. అందుకనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: