మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై నగరంలో దారుణం చోటు చేసుకుంది. వ్యాధికి చికిత్స చేస్తాడని డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 27 సంవత్సరాల ఒక మహిళ ఫైల్స్ సమస్యతో బాధ పడుతూ మే 28 2015 సంవత్సరంలో డాక్టర్ వంశరాజ్ ద్వివేదిని కలిసింది. చికిత్స పేరుతో డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి మహిళను నిద్రపోమని చెప్పాడు. 
 
మహిళ మత్తులో ఉన్న సమయంలో డాక్టర్ మహిళపై అత్యాచారం చేసి అత్యాచారాన్ని చిత్రీకరించాడు. ఆ తరువాత ఆ మహిళతో తన దగ్గర వీడియో ఉందని శారీరక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేశాడు. ఒప్పుకోకపోతే సోషల్ మీడియాలో వీడియో పెడతానని బెదిరించటంతో మహిళ ఒప్పుకుంది. 2018లో బాధిత మహిళకు వివాహమైంది. వివాహం అనంతరం కూడా డాక్టర్ మహిళను వేధించసాగాడు. 
 
మహిళ ఆ తరువాత డాక్టర్ ఫోన్ కాల్స్ కు స్పందించలేదు. బాధిత మహిళ స్పందించకపోవటంతో డాక్టర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆ వీడియో మహిళ భర్తకు చేరటంతో భర్త ఆ మహిళను వీడియో గురించి ప్రశ్నించాడు. భర్త తన భార్యతో కలిసి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ముంబై పోలీసులు డాక్టర్ వంశరాజ్ ద్వివేదిని అరెస్ట్ చేశారు. 
 
పోలీసులు డాక్టర్ వంశరాజ్ ను కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 17వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. ఏసీపీ మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతుందని మీడియాకు తెలిపారు. రోగులు దైవంగా భావించే వైద్యులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉండటంతో సమాజం ఎటు పోతుంది అనే ప్రశ్న ఎదురవుతోంది. దేశంలో ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా నేరస్థుల అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: