ఇప్పుడు నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం.  నెట్ కోసం ప్రతి ఒక్కరు తపించి పోతుంటారు.  నెట్ ను ఉపయోగంలోకి తీసుకురావడానికి పదేపదే ప్రయత్నం చేస్తుంటారు.  నెట్ ను ఎప్పుడు ఎలా కావాలంటే .  స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటె చాలు.  ఇప్పటి బయట నెట్ వర్క్ లు నెట్ ను అందిస్తున్నాయి.  రైల్వే స్టేషన్లో కూడా వైఫై అందుబాటులో ఉన్నాయి.  కానీ, అది కొంతవరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  


దీనిని అన్ని రైల్వే స్టేషన్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నం చేస్తున్నది.  ఈ వైఫైను రైల్ వైఫై అనే నెట్ వర్క్ సంస్థ చూసుకుంటోంది.  ఈ రైల్ వైఫై నెట్ వర్క్ ద్వారా అన్ని రైల్వే స్టేషన్స్ లో వైఫై ను కనెక్ట్ కావొచ్చు.  ఐఆర్.సిటిసి, రైల్ వైఫై ద్వారా కనెక్ట్ అయితే.. హైస్పీడ్ నెట్ వర్క్ ను మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఈ హై స్పీడ్ నెట్ వర్క్ వలన సినిమాలు చూసుకోవచ్చు.  


మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సాంగ్స్ ఇలా అన్ని రకాల సౌకర్యాలను అత్యంత వేగంగా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.  ఇది అమలులోకి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ నెట్ వర్క్ అవుతుంది.  రైల్‌వైర్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడం వల్ల వైఫై సేవలు పొందొచ్చు. వైఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి రైల్‌వైర్ నెట్‌వర్క్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు బ్రౌజర్‌లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు పాస్‌వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది

ఇలా కనెక్ట్ అయినా నెట్ వర్క్ తో  అనేక  రకాలుగా ఉపయోగపడుతుంది.  ఈ  సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరుతున్నది.  అయితే, ఇలా పబ్లిక్ వైఫై సౌకర్యం కల్పించడం వలన కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నది.  ఈ సౌకర్యాన్ని చట్ట వ్యతిరేక చర్యలను ఉపయోగించుకుంటే దాని వలన కలిగే అనర్ధాలు ఎక్కువుగా ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు.  మంచి ఉన్నట్టుగానే చెడు కూడా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: